KTR: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా, మాజీ మంత్రి, సిద్ధిపేట్ ఎమ్మెల్యే హరీశ్ రావు నివాసానికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. ఈ సందర్భంగా దాదాపు రెండు గంటల పాటు హరీష్ రావుతో సమావేశం అయినట్లు తెలుస్తుంది. తాజా రాజకీయలపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. దీంతో పాటు హరీష్ రావు తండ్రి ఆరోగ్య పరిస్థితిని కూడా కేటీఆర్ అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తుంది.
Read Also: BrahMos: చైనా, పాక్ వైమానిక రక్షణ వ్యవస్థలు బ్రహ్మోస్ ముందు సరిపోవు: యూఎస్ నిపుణుడు.
అయితే, మరోవైపు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరికాసేపట్లో అమెరికాకు ప్రయాణమై వెళ్ళనున్నారు. తన కుమారుడు గ్రాడ్యుయేషన్ కార్యక్రమం కోసం ఆమె అమెరికాకు వెళ్తున్నారు. ఇప్పటికే యూఎస్ లో కవిత భర్త అనిల్ ఉన్నారు. ఈ నెల 23వ తేదీన తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నా కవిత. ఇటువంటి సమయంలో కేటీఆర్, హరీశ్ రావు సమావేశం కావడం పార్టీ వర్గాల్లో ఉత్కంఠ రేపుతుంది.