కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి బహిరంగసవాల్ విసిరారు తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. నేను చెప్పేది తప్పయితే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా.. మీరు చెప్పేది తప్పైతే కేంద్ర మంత్రి పదవి వదిలి పెట్టకపోయినా.. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ రైతుల బంద్ కు మద్దతుగా కాంగ్రెస్ ర్యాలీ చేపట్టింది. ఇందిరా చౌక్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. మాస్టర్ ప్లాన్ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. షబ్బీర్ అలీ, కిసాన్ కేత్ రాష్ట్ర నాయకులు, కాంగ్రెస్ శ్రేణుల ధర్నా ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలన్న సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్ ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ రిట్ పిటిషన్ ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఇప్పటికే ప్రభుత్వం తరపు వాదనలు పూర్తి కాగా. ప్రతివాదుల తరపు వాదనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో హైకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది. నేటి మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి విచారణ చేపట్టనుంది.