తెలంగాణలో అమలవుతున్న పథకాల వైపుదేశం చూస్తోందన్నారు విప్ బాల్క సుమన్. తెలంగాణలో ఏ అభివృద్ది జరుగుతుందో పక్కరాష్ట్రాల్లో ఎలా జరుగుతుందో చర్చ జరగాలి..ప్రజలకు మేలు జరుగుతోంది. రైతు బంధు పెట్టడం వల్ల 8 రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది..అక్కడ అమలు చేసుకుంటున్నారు. మిషన్ భగీరథ 12రాష్ట్రాల్లో అమలు చేసుకుంటున్నారు. మిషన్ కాకతీయ ను ఆదర్శంగా తీసుకుంటున్నాయి..కంటివెలుగును విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలోనే అతి ఎక్కువ మందికి నేరుగా లబ్ధి చేకూర్చిన పథకం కంటి వెలుగు. ఇప్పటివరకు తెలంగాణలో 1.54 కోట్ల మందికి పరీక్షలు నిర్వహించి 50లక్షల మందికి కంటి అద్దాలను అందించడం జరిగిందన్నారు.
Read Also: India: ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆటో మార్కెట్‌గా ఇండియా..
మొదటి విడతలో కలిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి 100 రోజుల్లోనే తెలంగాణలో పూర్తిస్థాయిలో కంటి పరీక్షలు నిర్వహిస్తాం. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకానికి 200 కోట్లు కేటాయించాము. రాష్ట్రంలో 1500 వైద్య బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. మంచిర్యాల జిల్లాలో 484 క్యాంపులు 40 వైద్య బృందాలు జిల్లావ్యాప్తంగా కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాల స్ఫూర్తితో ప్రజాప్రతినిధులు పని చేయాలన్నారు విప్ బాల్క సుమన్,
Read Also: Ponguleti Srinivasa Reddy: ప్రజలు ఏం కోరుకుంటున్నారో రాబోయే కురుక్షేత్రంలో నెరవేరుస్తా..