ఢిల్లీలో కాపీ కొడతారు, గల్లీకి వచ్చి తిడతారని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. మన పథకాలు కాపీ కొట్టి దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు బంధు పథకాలు కాపీ కొట్టి అమలు చేస్తున్నారని ఆరోపించారు.
పార్టీ మారిన 12 మంది కాంగ్రెస్ MLAలపై CBIకి ఫిర్యాదు చేస్తామని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి సంచళన వ్యాఖ్యలు చేశారు. Mla ల కొనుగోలు విచారణ ఒకరు దోషిగా.. ఒకరు బాధితుడిగా జరుగుతుందని అన్నారు.
ఆత్రం సక్కు. ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే. 2018లో కాంగ్రెస్ నుంచి గెలిచి తర్వాత గులాబీ కండువా కప్పేసుకున్నారు. అప్పటి నుంచి అధికారపార్టీలో ఆయన పనేదో ఆయనదే. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిన కోవా లక్ష్మితో కొద్దిరోజులు వార్ నడిచింది. పాత కొత్త కేడర్ మింగిల్ కాలేదు. ఈ సమస్యను అధిగమించకపోగా.. ఎమ్మెల్యే అందుబాటులో ఉండబోరనే ప్రచారం సాగింది. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆసిఫాబాద్ గులాబీ శిబిరంలో కొత్త పోకడలు కనిపిస్తున్నాయి. స్థానిక…
Off The Record about BJP Focus on bhadrachalam: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో పాగా వేయాలని చూస్తోంది బీజేపీ. తెలంగాణలో పార్టీ కదలికలు పెరిగిన ప్రభావం ఈ నియోజకవర్గంపైనా ఉంటుందని ఆశిస్తున్నారు కమలనాథులు. ఈ నియోజకవర్గంలో కమ్యూనిస్టులు.. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు ఎక్కువ. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇక్కడ గులాబీ జెండా రెపరెపలాడించేందుకు చూస్తోంది బీఆర్ఎస్. ఈ మూడు పక్షాలను కాదని బీజేపీ పుంజుకోవాలి అంటే ఏదో అద్భుతం జరగాల్సిందే. తమ…
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ఈరోజు హైదరాబాద్ రానున్నారు. రేపు ఎల్లుండి సమీర్పేటలో నిర్వహించే దక్షిణాది రాష్ట్రాల లోక్సభ నియోజకవర్గాల కార్యకర్తల శిక్షణ శిబిరంలో పాల్గొంటారు. అసెంబ్లీ విస్తారకులు, తెలంగాణ ఇన్ఛార్జ్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.