N.V.S.S. Prabhakar: కేసీఆర్ కు సోమేష్ కుమార్ పట్ల మక్కువతోనే తెలంగాణలో ఉండేలా చేశారని బీజేపీ నేత NVSS ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. BRS పార్టీ పెట్టిందే హరీష్ రావును డిల్లీ కు పంపించడానికే అంటూ ఆరోపించారు. అవినీతి కు మారు పేరు brs అంటూ నిప్పులు చెరిగారు. కమ్యూనిస్ట్ ల కోరిక మేరకే ఖమ్మంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారంటే ఎద్దేవ చేశారు. BRS బలం ఏంటో అర్థమైంది కాబట్టి ఖమ్మంలో సభ పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం సభలో రైతులకు దిక్సూచి చూపిస్తానన్న కేసీఆర్.. రైతులకు సంకెళ్లు వేసింది మరచిపోయారా? అంటూ ప్రశ్నించారు. సభకు ముందు కేసీఆర్ రైతులకు క్షమాపన చెప్పాలని డిమాండ్ చేశారు. పాస్ బుక్ లు బ్యాంకుల్లో తనఖా ఉండటం వల్ల ప్రజలు అవమానంగా ఫీలవుతున్నారని తెలిపారు.
Read also: Girl Cheated: ప్రేమలో మోసపోయా.. న్యాయం చేయాలని యువకుడు సూసైడ్ నోట్
కేసీఆర్ కు కమ్యూనిస్టులు వంత పాడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను BRS లో చేర్చుకున్నప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ స్పందించలేదన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన అండగా ఉంటామని కాంగ్రెస్ భరోసా కల్పించలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ BRS పై రాజకీయ ఎదురు దాడి చేయలేదన్నారు. కేసీఆర్ ను కాపాడే పనిని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం భుజాలపైకి ఎత్తుకుందని ఆరోపణలు గుప్పించారు. సీఎస్ సోమేష్ కుమార్ ను రాజ్యాంగ బద్దంగా ఏపికి కేటాయించారని అన్నారు. కేసీఆర్ కు సోమేష్ కుమార్ పట్ల మక్కువతో తెలంగాణలో ఉండేలా చేశారని ఆరోపించారు. పదవి విరమణ పొందిన ఐఏఎస్, ఐపీఎస్ లను కేసీఆర్ సలహాదారుగా నియమించుకున్నారన్నారు. కేసీఆర్ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు ఐఏఎస్, ఐపీఎస్ ల సేవలను వినియోగించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్ట్ తీర్పు ను స్వాగతిస్తున్నామని ఈసందర్భంగా NVSS ప్రభాకర్ తెలిపారు.
Fake Challan: వరంగల్ జిల్లాలో నకిలీ చలాన్ల గుట్టురట్టు.. సూత్రధారి బ్యాంక్ క్యాషియర్!