CPI-CPM: రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తో కలిసివెళ్లాలని వామపక్షాలు నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో.. భవిష్యత్ కార్యాచరణపై చర్చించడానికి ఇవాళ సీపీఎం, సీపీఐ భేటీ కానున్నాయి. భాగ్యనంగరంలోని ఎంబీ భవన్‌లో జరగనున్న ఈ సమావేశానికి సీపీఎం నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర నేతలు చెరుపల్లి సీతారాములు, డీజీ నర్సింహారావు హాజరుకానుండగా.. సీపీఐ నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, పార్టీ నేతలు చాడ వెంకట్‌రెడ్డి, పల్లా వెంకట్‌రెడ్డి పాల్గొననున్నట్లు తెలిసింది. ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో సీపీఐ, సీపీఎంలు భారాసకు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.
Read also: Minister KTR: నేడే సిరిసిల్లకు కేటీఆర్.. అమ్మమ్మ ఊరులో బడి నిర్మాణానికి శంకుస్థాపన
ఇక.. వచ్చే ఎన్నికల్లో కొన్ని శాసనసభ స్థానాలను కైవసం చేసుకోవాలన్న కృతనిశ్చయంతో ఉన్న వామపక్షాలు భారాసకు మద్దతుగా నిలవాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించనున్న భారాస భారీ బహిరంగ సభలో పాల్గొనాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే సీపీఎం, సీపీఐ నేతలను ఆహ్వానించారు. ఇక.. కేరళ సీఎం పినరయ్ విజయన్‌ను ఆహ్వానించడంతోఆయన రాక ఖరారైంది. కాగా.. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజాను కూడా బహిరంగ సభకు కేసీఆర్ ఆహ్వానించినట్లు తెలిసింది. ఈసందర్బంగా.. వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై వామపక్షాలు ఇవాల్టి భేటీలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక.. ప్రజాసమస్యలపై ఐక్య కార్యాచరణ, ఐక్య ఉద్యమాల నిర్వహణపైనా ఈ సమావేశంలో చర్చకు రానున్నట్లు సమాచారం.
Distribution of Ration: పండుగొచ్చె.. కానీ రేషన్ ఎస్తలే..