భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈనెల 19న హైదరాబాద్ రానున్నారు ప్రధాని మోడీ. ఆయన పర్యటనలో భాగంగా పెరేడ్ గ్రౌండ్ లో చిన్న సభ ఏర్పాటుచేస్తున్నారు. సికింద్రబాద్ లో కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్ల పై ఎంపీ డా.కె.లక్ష్మణ్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పరిశీలించారు. ప్రధాని పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించనున్నారు మోడీ…. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకి శంకుస్థాపన చేస్తారు. కాజీపేట రైల్వే కోచ్ ఓవరాలింగ్ వర్క్ షాప్ కు కూడా శంకుస్థాపన చేస్తారు ప్రధాని మోడీ. వందే భారత్ ఎక్స్ ప్రెస్ సికింద్రాబాద్ నుంచి విజయవాడ వరకూ తిరగనుంది. ఈ ట్రైన్ కోసం ప్రయాణికులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
Read Also: Israel Protest : అట్టుడుకుతున్న ఇజ్రాయెల్.. రోడ్లను దిగ్బంధించిన నిరసనకారులు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీ డెవలప్ మెంట్ వర్క్స్ వేగంగా చేయనున్నారు. 700 కోట్లతో ఆధునికీకరణ పనులు చేపట్టారు. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రకటన తర్వాత తొలిసారి సికింద్రాబాద్ రానున్న మోడీ ఏం మాట్లాడతారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ నెల 18న ఖమ్మంలో BRS సభకు మూడు రాష్ట్రాల సీఎంలు రానున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తో పాటు కేరళ సీఎం పినరయి విజయన్.. మాజీ సీఎం అఖిలేష్ లకు ఆహ్వానం పంపారు సీఎం కేసీఆర్. BRS ఏర్పాటయ్యాక తొలి బహిరంగ సభ ఇదే. తొలుత ఢిల్లీలో నిర్వహించాలని అనుకున్న సభ ఖమ్మంకు మార్పు చేశారు.
సికింద్రాబాద్ లో ప్రధాని మోడీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు రానున్న నేపధ్యంలో రైల్వే స్టేషన్ ను సందర్శించారు బీజేపీ నేతలు.రైల్వే అధికారులతో సమావేశమై ఏర్పాట్లను తెలుసుకున్నారు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్,రాజ్య సభ సభ్యుడు లక్ష్మణ్ తో పాటు పలువురు బీజేపీ నేతలు.దక్షిణ మధ్య రైల్వే అధికారులతో బండి సంజయ్, లక్ష్మణ్ భేటీ అయ్యారు.
Read Also: Agniveer Scheme: అగ్నివీర్ ఫస్ట్ బ్యాచ్ రెడీ.. ఫిబ్రవరి నుంచి ఎంట్రీ
* రూ.2,400 కోట్ల వ్యయంతో రైల్వే అభివ్రుద్ది పనులు ప్రారంభించనున్న ప్రధాని
* రూ.700 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ
*vరూ.1231 కోట్లతో సికింద్రాబాద్-మహబూబ్ నగర్ డబ్లింగ్ పనులు
• రూ.521 కోట్లతో ఖాజీపేట రైల్వే కోచ్ ఓరాలింగ్ వర్క్ షాప్ పనులను వర్క్ షాప్ పనులు
* 19న వందేభారత్ రైలు ప్రారంభం సందర్భంగా వివిధ అభివ్రుద్ధి పనులు చేపట్టనున్న మోదీ