Ponguleti Srinivasa Reddy: తనకు సెక్యూరిటీ అవసరం లేదని తను ఉగ్రవాదిని కాదు కబ్జాలు చేయలేదని మాజీ ఎం.పీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భద్రాద్రి పినపాక నియోజకవర్గ ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గంగిరెద్దుల అడించే వారిలా సంక్రాంతి కి రాలేదని అన్నారు. అధికారం లేకపోయినా..సెక్యూరిటీ నీ నేను అడుగలేదని.. తీసివేసిన నేను అడుగలేదని అన్నారు. వున్న ఇద్దరు గన్ మెన్ లను తీసివేసిన నొచ్చుకొనని అన్నారు. నాకు సెక్యూరిటీ అవసరం లేదు లక్షలాది మంది అభిమానులు ఉన్నారని తెలిపారు తనకు ఈ సెక్యూరిటీ అవసరం లేదని స్పష్టం చేశారు. తను ఉగ్రవాదినీ కాదని, కబ్జా లు ఎక్కడ చేయలేదని.. సంపాదించుకున్న దానిని ఖర్చు పెడుతున్నానని పొంగిలేటి అన్నారు. పదవులు లేకపోయినప్పటికీ నేను తిరుగుతున్న సమయంలో నాకు ప్రజల ఆవేదన, ఆక్రోశం చూశానన్నారు. రాజకీయంగా గాడ్ ఫాదర్ ఎవ్వరూలేరన్నారు. నాకు గాడ్ ఫాదర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు, తెలంగాణ ప్రజలని తెలిపారు. కొద్ది మంది అంటున్నారు పినపాక కు నికేమి పని అంటున్నారని అన్నారు. ప్రజల కష్ట సుఖల్లో పాలు పంచుకునేందుకు వచ్చానని స్పష్టం చేశారు.
Read also: Bandi Sanjay: సోమేశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలి
వై.ఎస్.ఆర్ బరిలో ముగ్గురిని గెలిపిస్తే మరో ఇద్దరు ముందే టీఆర్ఎస్ లో చేరారని అన్నారు. కేసీఆర్ నాయకత్వం లో కేటీఆర్ ఆధ్వర్యంలో పని చేశానని తెలిపారు. సమయం వచ్చినప్పుడు నేను అన్ని వివరంగా చెపుతానని అన్నారు. నాలుగేళ్ల కాలం లో పదవులు లేకపోవడానికి కారణం ఏమిటో మీకు తెలుసన్నారు. టీఆర్ఎస్ లో మనకు, మన తో వున్న వారికి ఏమి జరిగిందో మీకు తెలుసని.. తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. నేను ఇంకా నాతో పనించేస్తున్నానని అన్నారు. గడిచిన నాలుగేళ్ళలో మనకు ఎటువంటి గౌరవం లభించింది మీకు తెలుసన్నారు. ఎన్ని ఇబ్బందులు, అవమానాలు, ఎదురైన నమ్ముకున్న వారికోసం మీతోనే ఉంటాడని, చివరకు మీతోనే శీనన్న చస్తాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగు సంవత్సరాల నుంచి నా ఆవేదన ఎవ్వరికీ చెప్పాలని, మీరు నా కష్టాలను చెప్పితే ఎందుకు ఉలిక్కి పడుతున్నారని అన్నారు. అందరికీ పదవులు ఇవ్వలేం కానీ.. ఎనాడన్న బరోసా ఇచ్చారా? ఇవ్వడానికి ప్రయత్నం చేశారా? అని ప్రశ్నించారు. నేను సహాయం చేస్తుంటే దానిని.. ప్రేమించడం భరోసా ఇవ్వడం మీకు తెలియదన్నారు. ప్రేమించే వ్యక్తి ఒక్క వ్యక్తి వుంటే గద్దల్ల వెంట తగులుతున్నారని తెలిపారు. గంగిరెద్దుల సంక్రాంతి రోజు వచ్చిన వ్యక్తిని కాదన్నారు. పార్టీ మారుతున్ననని.. పార్టీ మారనని చెప్పడం లేదన్నారు.
Read also: Revanth Reddy: సోమేష్ కుమార్ పై సీబీఐ విచారణ జరిపించాలి.. రేవంత్ ట్విట్
మనసులో ఆవేదన చెపుతున్నానని అన్నారు. కష్టంలో గొంతు ఎత్తకుండా ఆనాడు లేను.. ఇప్పుడు వుండనన్నారు. పదవులు అవే వస్తాయని, పోయేటప్పుడు అవే పదవులు వుండవన్నారు. పదవులు అనుభవించినప్పుడు ప్రక్కవాడికి ఏమి చేశావనేది కావాలన్నారు. పోడు భూముల సమస్య ఇంకా పరిష్కారాలు కాలేదన్నారు. ఎమ్మెల్యేలు ఆ ప్రాంతంలో రాజులు అరాచకాలు చేస్తున్నారని తెలిపారు. చేస్తున్న ప్రతి పనికి అనుభవించక తప్పదన్నారు. తిరిగి వడ్డీతో చెల్లించాల్సి వస్తోందని, ఎన్నికల కోసం శీనన్న రాలేదన్నారు. ప్రజలు మౌనంగా ఎప్పుడు లేరు గౌరవం లేని చోట, గౌరవించని చోట శీనన్న కాంట్రాక్టర్ కదా.. ఎన్ని వేల కోట్లు ఎలా ఇచ్చారో నేను వేదిక మీద నుంచే చెబుతానన్నారు.టీఆర్ఎస్ లోకి రాక పోతేనే నేను కాంట్రాక్టర్ ను.. జోలె వేసుకుని అయిన తిరిగి రాజకీయం చేస్తానన్నారు. మీరు నన్ను ఇబ్బందులు పెట్టవచ్చు మిమ్ములను కొట్టేవారు వుంటారన్నారు. భయంతో ప్రతి ఒక్క రోజు బ్రతక లేరని, కష్టాలు పెట్టడం అధికారంలో వున్న వారి నైజమన్నారు. భయపడితే గౌరవం ఇచ్చి పుచ్చుకునే బందం.. ప్రేమ రెండు ప్రక్కల వుండాలన్నారు. నాలుగు ఏళ్ల కాలంలో తండ్రి కొడుకుల బంధంగా నడిచాను..నాకు ఏమి ప్రేమ దక్కిందన్నారు. అధికారం ఉంది కదా అని అసెంబ్లీ నీ ఒక్క సామ్రాజ్యంగా చేసుకుని దోచుకుంటున్నారని ఆరోపించారు. నా వ్యాపారం లావాదేవీ లా గురించి టైం వచ్చినప్పుడు చెప్పి తిరుతా అని పొంగిలేటి స్పష్టం చేశారు.