2 లక్షల మంది పోలీస్ అభ్యర్థుల విన్నపాన్ని వినే సమయం సీఎం కు లేదా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. బీజేవైఎం కార్యకర్తలు, పోలీసు పరీక్ష అభ్యర్థుల అరెస్టును ఖండించారు.
దళిత బంధు పథకం నియోజకవర్గానికి 500 సరిపోవని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పిసి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మం జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీని రాజకీయ శత్రువునే కాదని, తెలంగాణ కు నష్టమన్నారు.
జాతీయ రాజకీయాలే లక్ష్యంగా టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చేసిన తెలంగాణ సీఎం, గులాబా పార్టీ బాస్ కేసీఆర్.. ఏపీలోనూ పార్టీ విస్తరణకు చర్యలు చేపట్టారు.. అయితే, సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎంపీ జీవీఎల్ మండిపడ్డారు.. ఆంధ్రులను తరిమికొడతానన్న కేసీఆర్ ఏ ముఖం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు? అని ప్రశ్నించారు జీవీఎల్.. బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాతే కేసీఆర్ ఏపీలో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు.. ఆంధ్రా పార్టీలు, నాయకత్వం వద్దన్న కేసీఆర్‌కు ఇక్కడ పనేంటి? అని నిలదీశారు. ఇక, తెలంగాణలోనూ…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు టీఆర్ఎస్ను కాస్తా బీఆర్ఎస్గా మార్చేవారు గులాబీ పార్టీ బాస్ కేసీఆర్.. ఆంధ్రప్రదేశ్‌పై కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.. తోట చంద్రశేఖర్‌తో పాటు మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు సహా మరికొందరు నేతలు బీఆర్ఎస్లో చేరనున్నారు.. మరోవైపు, ఏపీలోని 175 స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని.. గెలిచేది కూడా తామేనని ధీమా వ్యక్తం చేశారు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి.. అంతేకాదు, పోలవరం, ఏపీకి ప్రత్యేక హోదా విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.. దీంతో,…