అంబర్‌పేట అభివృద్ధిపై కిషన్ రెడ్డి చర్చకు సిద్ధంగా ఉన్నారా అని అంబర్‌పేట బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సవాల్ విసిరారు. నియోజకవర్గంలోని మహంకాళి టెంపుల్ అయినా, ఎక్కడైనా సరే చర్చిద్దాం అని చెప్పారు. ప్రచారంలో భాగంగా.. ఈరోజు అంబర్‌పేట నియోజకవర్గంలోని చెన్నారెడ్డి నగర్, ప్రేమ్ నగర్, న్యూ పటేల్ నగర్లలో ఆయన తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆయనతో పాటు కాలేరు పద్మావతి, కార్పొరేటర్ లావణ్య గోల్నాకలో ఇంటింటికి వెళ్లి మహిళలకు బొట్టు పెట్టి కారు…
తెలంగాణ ఎన్నికలు దగ్గర పడే కొద్ది రాజకీయ పార్టీ నేతలు జోరు పెంచుతున్నారు. వీలైనంత వరకు అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేసే విధంగా షెడ్యూల్ చేసుకుని ప్రచారంలో దూసుకుపోతున్నారు. అందులో భాగంగా.. సీఎం కేసీఆర్ తాండూరులో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కత్తి వారికి ఇచ్చి యుద్ధం మనల్ని చేయమనడం సమంజసం కాదు.. ప్రజలు ఆలోచించండని అన్నారు.
Harish Rao Counters to Nirmala Sitharaman Comments: బీజేపీ నేత, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలతో బీజేపీ అసలు రంగు బయటపడిందని బీఆర్ఎస్ మంత్రి హరీశ్ రావు అన్నారు. పంట పొలాల మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం తెలంగాణ ప్రభుత్వంను ఒత్తిడి చేసిందని, మీటర్లు పెట్టలేదనే తెలంగాణ రాష్ట్రంకు ఇచ్చే డబ్బులు ఇవ్వలేదని అనడం ద్వారా బీజేపీ బండారాన్ని నిర్మలమ్మ స్వయంగా బయటపెట్టారన్నారు. సీఎం కేసీఆర్‌ది రైతు పక్షపాత ప్రభుత్వమనే విషయం కేంద్రమంత్రి వ్యాఖ్యలతో…
మంథని చౌరస్తాలో నడి రోడ్డుపై నిల్చుంటా బీఆర్ఎస్ నేతలను వచ్చి నన్ను చంపమను అంటూ పోలీసులపై మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న రాత్రి మహాముత్తారంలో ఓడేడు సర్పంచ్ బక్కారావుపై జరిగిన దాడిని ఖండిస్తూ మంథని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు.
Harish Rao Said Congress Party Copy Ramakka Song: బీఆర్ఎస్ మేనిఫెస్టోని కాంగ్రెస్ పార్టీ కాపీ కొట్టిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. మేనిఫెస్టోని మాత్రమే కాదని.. రామక్క పాటని (గులాబీల జండలే) కూడా కాంగ్రెస్ సహా బీజేపీ కూడా కాపీ కొట్టిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వారే సీఎంలు అనుకుంటున్నారని, సుతి లేని కాంగ్రెస్ చేతిలో తెలంగాణ రాష్ట్రం పడితే ఆగం అవుతాం అని హరీశ్ రావు పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలు 2023 ప్రచారంలో…
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో హుస్నాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు మద్దతుగా రోడ్ షో, కార్నర్ మీటింగ్ లో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఎన్నికలంటే breaking news, latest news, telugu news, harish rao, bjp, congress, brs,
Devendra Fadnavis: కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో కుటుంబ పాలన ఉందని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శించారు. తెలంగాణను బీఆర్ఎస్ లూటీ చేసిందని మంగళవారం దుయ్యబట్టారు. ఇక్కడ కుటుంబ పాలన మాత్రమే సాగుతోందని ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ఫడ్నవీస్ ఆరోపించారు. అవినీతి ఒలింపిక్స్ నిర్వహిస్తే అన్ని పథకాలు బీఆర్ఎస్ పార్టీకే వస్తాయని, తెలంగాణలో అంత అవినీతి జరిగిందని ఎగతాళి చేశారు.