ఖమ్మం జిల్లా వేంసూరు మండలం మర్లపాడు సెంటర్ లో కాంగెస్ పార్టీ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వర రావు, సత్తుపల్లి కాంగ్రెస్ పార్టీ నియోజక అభ్యర్థి డాక్టర్ రాగమయి దయానంద్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సత్తుపల్లి శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని అన్నారు. డాక్టర్ రాగమయి దయానంద్ లు ప్రజా సేవ చేసిన నాయకులని…
మెదక్ జిల్లా తూప్రాన్ లో బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభ నిర్వహించారు. ఈ సభలో ప్రధాని మోదీ పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో మొదటి సారి బిజెపి ప్రభుత్వం ఏర్పాటు కానుందని తెలుగులో మాట్లాడారు. దుబ్బాక, హుజురాబాద్ లో ట్రైలర్ చూశారు...ఇక సినిమా చూస్తారని ప్రధాని మోదీ తెలిపారు. సకల జనుల సౌభాగ్య తెలంగాణ బీజేపీతోనే సాధ్యమన్నారు. న
Ponguleti Srinivas Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రచారం చివరి దశకు చేరడంతో నాయకులంతా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.
Revanth Reddy: బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి దుర్ఘటనలు ఎన్నో అని తెలంగాణ రాష్ట్ర స్థానిక ప్రజాప్రతినిధులకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో స్థానిజ ప్రజాప్రతిందుల దుస్థితిపై లేఖలో వివరించారు.
CM KCR: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. మరికొద్ది రోజుల్లో ప్రచారానికి తెరపడనుంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో విపక్షాల కంటే ముందున్న బీఆర్ ఎస్ దూకుడు పెంచింది.
Rahul Gandhi: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. నాలుగు రోజుల్లో ఎన్నికల ఓటింగ్ జరగనుంది. దీంతో పాటు గెలుపే ధ్యేయంగా అన్ని పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి పాల్గొన్నారు. బాల్కొండ కాంగ్రెస్ అభ్యర్ధి ముత్యల సునిల్ రెడ్డి తరుఫున ఆమే ప్రచారం నిర్వహించారు. అందులో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ.. ఒక సైడ్ బీఆర్ఎస్ అవినీతి విజృంభిస్తుంది.. రెండో సైడ్ లో కాంగ్రెస్ పోరాడుతుందని తెలిపారు. కేసీఆర్ కి, ఆ పార్టీకి ప్రస్టేషన్ మొదలైంది.. ఓడిపోతున్నాం అని ఏదేదో మాట్లాడుతున్నారని…
ఎన్నికల ప్రచారంలో భాగంగా కల్వకుర్తిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగిరినపుడే మన గౌరవం పెరుగుతుందని అన్నారు. బీఆర్ఎస్ నేతలు బరితెగించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇక్కడ కట్టిన సాగునీటి ప్రాజెక్టులు, రహదారుల అభివృద్ధి కాంగ్రెస్ హయాంలో జరిగిందేనని రేవంత్ తెలిపారు.
సిద్దిపేట జిల్లా చేర్యాలలో మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అందులో భాగంగా ఆయన కాంగ్రెస్, బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్ళ మీటింగ్ లకు ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయని మంత్రి ఆరోపించారు. అదే.. బీఆర్ఎస్ మీటింగ్ లకి ఇసుక వేస్తే రాలనంత జనం వస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ వాళ్లు మార్పు కావాలి అంటున్నారు.. మార్పు అంటే 24 గంటల కరెంట్ కాకుండా మూడు గంటల కరెంటా అని విమర్శించారు.
Rahul Gandhi Comments: సాధించుకున్న తెలంగాణలో ప్రజల సంపూర్ణ కల సహకారం కాలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. శనివారం రాహుల్ గాంధీ వేములవాడలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ మీకు తోడుగా ఉంది. మీ కలలు కూడా సహకారం చేసింది మేమే. కంప్యూటర్ నమోదు పేరుతో భూములన్ని ధరణిలో నమోదు చేస్తూనే.. 24 గంటలు భూములను ఎలా లాక్కోవాలని కేసీఆర్ చూస్తున్నారు’ అని…