దేశ ద్రోహం కేసు, తెల్గి స్కాంలో మూడేళ్లు జైలుకు పోయి వచ్చిన వ్యక్తి బీజేపీ అభ్యర్థి కృష్ణ యాదవ్ అవినీతిపై మాట్లాడడం విడ్డూరంగా ఉందని అంబర్ పేట బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ విమర్శించారు. ఈ సందర్భంగా.. ప్రచారంలో జోరు పెంచారు. ఈరోజు గోల్నాక డివిజన్లోని శంకర్ నగర్, అశోక్ నగర్ తదితర ప్రాంతాలలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు.
Pawan Kalyan: బీఆర్ఎస్ పార్టీని ఎందుకు తిట్టలేదు అంటే ఆంధ్రలో మాదిరిగా తెలంగానలో బాగా తిరగలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్రాలో గుండాల్ని రౌడీల్ని ఎదుర్కొని ఉన్నానంటే అది తెలంగాణ స్ఫూర్తి మాత్రమే అన్నారు.
మహముత్తారం: కిష్ణాపూర్ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం రాత్రి కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రెండు పార్టీల నాయకులు మధ్య జరిగిన గొడవలో ఓడెడ్ సర్పంచ్, కాంగ్రెస్ నేత సిరికొండ బక్కారావు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై బక్కారావు కొడుకు సందీప్ మహముత్తారం పోలీసుల స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు తన తండ్రి బక్కారావు, తల్లిపై హత్యయత్నం చేసిన సందీప్ ఫిర్యాదులో పేర్కొన్నారు. Also Read:…
ఎన్నికల ప్రచారంలో భాగంగా.. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రెండుసార్లు కేసీఆర్ ను ఎమ్మెల్యేను చేస్తే... మల్లన్న సాగర్ లో మిమ్మల్ని నిండా ముంచాడని ఆరోపించారు. కొండపోచమ్మలో మిమ్మల్ని తోసిండు, రంగనాయక్ సాగర్ లో ముంచిండని విమర్శించారు.
బోధన్ లో ఎమ్మెల్యే షకీల్ పై కాంగ్రెస్ దాడిని ఎమ్మెల్సీ కవిత ఖండించింది. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు అభివృద్ధికి అరాచకానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని అన్నారు. కాంగ్రెస్ నాయకుల దాడులు రోజు రోజుకు పెరుగుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపాన్ని ప్రజలు గమనించాలని కవిత కోరారు. ప్రతి చోట అల్లర్లు, దాడులు చేసే చరిత్ర కాంగ్రెస్ ది అని విమర్శించారు.
కొడంగల్ నియోజక వర్గం కోస్గి ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఆయనతో పాటు రాజ్యసభ సభ్యులు కేశవరావు, కోస్గి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి పట్నం నరేందర్ రెడ్డి, మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి ఈ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికలు రాగానే ఆగం చేసే వారు వస్తారని ఆరోపించారు. ప్రజల మధ్యన ఉండే వారికి ఓటు వేస్తే కొడంగల్ అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
అంబర్పేట అభివృద్ధిపై కిషన్ రెడ్డి చర్చకు సిద్ధంగా ఉన్నారా అని అంబర్పేట బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సవాల్ విసిరారు. నియోజకవర్గంలోని మహంకాళి టెంపుల్ అయినా, ఎక్కడైనా సరే చర్చిద్దాం అని చెప్పారు. ప్రచారంలో భాగంగా.. ఈరోజు అంబర్పేట నియోజకవర్గంలోని చెన్నారెడ్డి నగర్, ప్రేమ్ నగర్, న్యూ పటేల్ నగర్లలో ఆయన తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆయనతో పాటు కాలేరు పద్మావతి, కార్పొరేటర్ లావణ్య గోల్నాకలో ఇంటింటికి వెళ్లి మహిళలకు బొట్టు పెట్టి కారు…
తెలంగాణ ఎన్నికలు దగ్గర పడే కొద్ది రాజకీయ పార్టీ నేతలు జోరు పెంచుతున్నారు. వీలైనంత వరకు అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేసే విధంగా షెడ్యూల్ చేసుకుని ప్రచారంలో దూసుకుపోతున్నారు. అందులో భాగంగా.. సీఎం కేసీఆర్ తాండూరులో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కత్తి వారికి ఇచ్చి యుద్ధం మనల్ని చేయమనడం సమంజసం కాదు.. ప్రజలు ఆలోచించండని అన్నారు.
Harish Rao Counters to Nirmala Sitharaman Comments: బీజేపీ నేత, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలతో బీజేపీ అసలు రంగు బయటపడిందని బీఆర్ఎస్ మంత్రి హరీశ్ రావు అన్నారు. పంట పొలాల మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం తెలంగాణ ప్రభుత్వంను ఒత్తిడి చేసిందని, మీటర్లు పెట్టలేదనే తెలంగాణ రాష్ట్రంకు ఇచ్చే డబ్బులు ఇవ్వలేదని అనడం ద్వారా బీజేపీ బండారాన్ని నిర్మలమ్మ స్వయంగా బయటపెట్టారన్నారు. సీఎం కేసీఆర్ది రైతు పక్షపాత ప్రభుత్వమనే విషయం కేంద్రమంత్రి వ్యాఖ్యలతో…