Ponguleti Srinivas Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రచారం చివరి దశకు చేరడంతో నాయకులంతా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే జాతీయ స్థాయి నాయకుల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా క్షణం తీరిక లేకుండా ప్రజల్లోకి వెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలంటూ ఓటర్లను కోరుతున్నారు. వేంసూరు మండలం మర్లపాడు సెంటర్ లో కాంగెస్ పార్టీ మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు.
Read Also:Kollywood: జైలర్ vs లియో… బాక్సాఫీస్ వార్ లో గెలిచిందెవరో తెలుసా?
సత్తుపల్లి నియోజకవర్గం లో ఎలాంటి డౌట్ లేదు మూడు రంగుల జెండా రెపరెపలాడుతుందన్నారు. రాగమయి గెలుపు లో అందరం భాగస్వాములం కావాలని ఓటర్లకు సూచించారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ప్రజల వద్దకు తీసుకు వెళ్లాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ ని నమ్ముతున్నారు. మీ అందరి దీవేనలతో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని జోస్యం చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాలు గెలుస్తున్నామన్నారు. ఈ ప్రభజనం ముందు బడా బాబులు తుడుసుకుపెట్టుకొని పోతారన్నారు. ప్రచారానికి మిగిలి ఉన్నది మూడు రోజులు మాత్రమేనని.. ఉన్న సమయాన్ని ఉపయోగించుకుని కష్టపడి పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. ఆ తర్వాత ఐదు సంవత్సరాలు మీము మిమ్మల్ని సాకుతామన్నారు.
Read Also:Kishan Reddy: ఇది నాల్గవది అయినా స్పందించరా.. కేసీఆర్ కు కిషన్ రెడ్డి బహిరంగ లేఖ..