Rahul Gandhi Comments: సాధించుకున్న తెలంగాణలో ప్రజల సంపూర్ణ కల సహకారం కాలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. శనివారం రాహుల్ గాంధీ వేములవాడలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ మీకు తోడుగా ఉంది. మీ కలలు కూడా సహకారం చేసింది మేమే. కంప్యూటర్ నమోదు పేరుతో భూములన్ని ధరణిలో నమోదు చేస్తూనే.. 24 గంటలు భూములను ఎలా లాక్కోవాలని కేసీఆర్ చూస్తున్నారు’ అని అన్నారు.
Also Read: Perni Nani: పవన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్
మీ జేబులోని లక్ష కోట్ల రూపాయలతో కాలేశ్వరం ప్రాజెక్టు కడితే.. పిల్లర్లు కుంగి పోతున్నాయి. ఇందులో అవినీతి జరిగిన ప్రతి రూపాయిని మళ్లీ మీకు జేబులో పెడతాం. అలాగే.. ‘ఇప్పుడు తెలంగాణలో దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణకు మధ్య కొట్లాట జరుగుతోంది. దేశంలో ప్రధానమంత్రి మోదీ… రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఈ పదవుల్లోనే శాశ్వతంగా ఉండాలని ఆలోచిస్తున్నారు. ఇక్కడ ముందు వరుసలో మాకు బీఆర్ఎస్ పార్టీ పోటీగా ఉంటే… దాని వెనకాల బీజేపీ, ఎంఐఎం ఉంది. దేశంలో బీజేపీ పార్టీ వెనకాల బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి పనిచేస్తున్నాయి. ఈ పార్టీలన్నీ మాకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి.
అస్సాం, మహారాష్ట్ర, గుజరాత్ లాంటి ఇతర రాష్ట్రాల్లోనూ ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుందో అక్కడ మాకు వ్యతిరేకంగా ఎంఐఎంను దింపి ఓట్లను చీల్చుతున్నారు. నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఎవరు పనిచేసిన వారిపై సీబీఐ ఈడీ కేసులు నమోదు అవుతాయి. నామీద కూడా సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేసి అర్ధరాత్రి రెండు గంటల వరకు విచారణ జరిపారు. నా ఇంటిని, తాళాలను కూడా లాక్కున్నారు. నామీద అక్రమ కేసులు పెట్టి పార్లమెంటు నుండి బయటకు పంపారు. దేశంలోని ప్రతి పేదవాడి గుండెల్లో నాకు నివాసం ఉందని సంతోషంగా ఇంటి తాళాలు ఇచ్చి వేశాను. కేసీఆర్ మీద సీబీఐ, ఈడీ కేసులు ఎందుకు నమోదు అవుతలేవో ప్రజలు తెలుసుకోవాలి.
Also Read: Jaipur tinder murder Case: టిండర్‌లో పరిచయం, డేట్.. కట్ చేస్తే కిడ్నాప్, దారుణహత్య
కేసీఆర్, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అవసరమైన ప్రతి సందర్భంలో మద్దతు ఇస్తున్నారు. ఇందులో భాగంగానే జీఎస్టీ, నోట్ల రద్దు, రైతు చట్టాలు వాటిపై చట్టసభల్లో మద్దతు తెలపడమే నిదర్శనం. మీతో నాకు రాజకీయ సంబంధమే కాదు.. కుటుంబ-రక్త సంబంధం కూడా ఉంది. మా నాయనమ్మ ఇందిరా గాంధీ నుండి మొదలుకొని మా నాన్న రాజీవ్ గాంధీ వరకు మీతో ఉన్న సంబంధమే నాకు ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం అయిపోయింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన గ్యారెంటీలన్నింటినీ మొదటి క్యాబినెట్ సమావేశంలోనే చట్టబద్ధతను కల్పించి ప్రతి సంక్షేమ పథకాన్ని పేదలకు అందిస్తాం’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.