KTR Tweet: డీప్‌ఫేక్‌లపై బీఆర్ఎస్ శ్రేణులు, సోషల్ మీడియా వారియర్స్‌ను మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. ఓటింగ్ సమీపిస్తున్న కొద్దీ చాలా డీప్‌ఫేక్‌లు ఉండవచ్చని హెచ్చరించారు.
Story Board: డబ్బులేకపోతే ఎన్నికలు కష్టం కానీ.. డబ్బుంటే ఏముంది నల్లేరుపై నడకే అనుకునే రోజులు పోయాయి. ఓటర్లను లెక్కపెట్టి.. తలకింత అని నోట్లు విదిల్చేసి.. హాయిగా ఇంట్లో కూర్చునే కాలం కాదిది. ఎంత డబ్బులు పంచినా.. ఓటు పంచిన వారికి పడుతుందనే గ్యారంటీ అసలు లేదు. ప్రజలకు విధేయంగా లేని పార్టీలకు.. తామెందుకు విధేయంగా ఉండాలని ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. దశాబ్దాలుగా ఓటర్లకు డబ్బులు పంచే కల్చర్ కు రాజకీయ పార్టీలు అలవాటుపడ్డాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో…
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకున్న వేళ గులాబీ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రచారం మరింత స్పీడ్ పెంచారు. నేడు మరో నాలుగు ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన పాల్గొననున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ నుండి గాంధీ చౌక్ వరకు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాణి రుద్రమ రోడ్డు షో నిర్వహించారు. ఈ రోడ్డు షోలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి జయప్రకాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాణి రుద్రమ మాట్లాడుతూ.. సిరిసిల్ల ఎమ్మెల్యే పేరు గుర్తు ఉందా అని గ్రామాల్లో అడిగితే ఒక్కసారి కూడా కనపడలేదు అని అంటున్నారన్నారు. 14 ఏళ్లుగా గెలిచిన కేటీఆర్ కు సిరిసిల్లలో సొంత ఇల్లు…
CM KCR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. డిసెంబర్ 30న ఎన్నికలు జరగోతున్నాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. అన్ని పార్టీలు కూడా హమీల వర్షం కురిపిస్తున్నాయి. మూడోసారి అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్ పార్టీ విస్తృతంగా హమీలను ప్రకటిస్తోంది. తాజాగా మైనారిటీ ఓటర్లను ఆకట్టుకునేందుకు సీఎం కేసీఆర్ కీలక హామీలను ఇచ్చారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ మక్తల్ రోడ్ షో లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 3 తర్వాత కొన్ని పథకాలు ప్రారంభిస్తున్నామని తెలిపారు. 2014లో సిలిండర్ కు మొక్కండి.. ఓటు వేయండి అని మోదీ అన్నారు. ఆనాడు రూ.400 సిలిండర్ ఇప్పుడు రూ.1200 అయ్యిందని కేటీఆర్ తెలిపారు. జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తాం.. రేషన్ కార్డులు ఉన్నవారికి సన్న బియ్యం ఇస్తామని ఈ సందర్భంగా చెప్పారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంటలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానకొండూర్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మార్పు రావాలి కాంగ్రెస్ గెలవాలి, బై బై కేసీఆర్ నినాదంతో రేవంత్ రెడ్డి కార్యకర్తల్లో జోష్ నింపారు. కరీంనగర్ గడ్డ మీద తెలంగాణ రాష్ట్రం ఇస్తామని సోనియమ్మ మాట ఇచ్చింది..…
సంగారెడ్డిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణను అభివృద్ధి చేయడం కంటే అప్పుల కూపీలోకి తీసుకెళ్లారని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబ దోపిడీ తెలంగాణలో సాగుతుందని.. కేసీఆర్ పాలనలో భారీ అవినీతి జరుగుతుందని ఆయన మండిపడ్డారు.