నిజామాబాద్ జిల్లా బాల్కొండ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి పాల్గొన్నారు. బాల్కొండ కాంగ్రెస్ అభ్యర్ధి ముత్యల సునిల్ రెడ్డి తరుఫున ఆమే ప్రచారం నిర్వహించారు. అందులో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ.. ఒక సైడ్ బీఆర్ఎస్ అవినీతి విజృంభిస్తుంది.. రెండో సైడ్ లో కాంగ్రెస్ పోరాడుతుందని తెలిపారు. కేసీఆర్ కి, ఆ పార్టీకి ప్రస్టేషన్ మొదలైంది.. ఓడిపోతున్నాం అని ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ చేతిలో తెలంగాణ పెడితే రూ.6 వేల కోట్ల అప్పుల్లోకి తీసుకెళ్లాడని మండిపడ్డారు.
Read Also: Biggboss 7 Telugu: బ్రేకింగ్.. హౌస్ కు గుడ్ బై చెప్పిన శివాజీ.. ?
బీఆర్ఎస్ ని గద్దె దించాలి.. బీఆర్ఎస్, బీజేపీ ఒకటైందని.. అందుకే పార్టీ నుండి బయటకు వచ్చానన్నారు. కేసీఆర్ అవినీతి చేస్తున్నాడు అన్నప్పుడు బీజేపీ ఎందుకు వారిపై చర్యలు లేవని ప్రశ్నించింది. కవిత తప్పు చేయకుంటే ఈడీ ఆఫీసుకు ఎందుకు పిలిచారని ప్రశ్నించింది. ఇద్దది మధ్య ఏం జరిగిందో కానీ ఎలాటి చర్యలు లేవని పేర్కొ్న్నారు. ఢిల్లీ బీజేపీ నాయకులు వస్తరు అవినీతి కుటుంబ పార్టీ అంటారు కానీ చర్యలు మాత్రం తీసుకోరని అన్నారు. బీజేపీ మీటింగ్ లు అన్ని ఉత్తితి మీటింగ్ లేనని ఆరోపించారు.
Read Also: Royal Enfield Bikes : రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి మరో కొత్త బైక్.. కళ్లు చెదిరే ఫీచర్స్.. ధర ఎంతంటే?
బీజేపీలో చాలా మంది కేసీఆర్ మనుషులునున్నారని విజయశాంతి తెలిపారు. కేసీఆర్ చాలా పెద్ద కుట్రదారు.. లాస్ట్ టైం లో గేమ్ ఆడుతాడని దుయ్యబట్టారు. కేసీఆర్ గెలిస్తే తెలంగాణ చస్తుంది.. కాంగ్రెస్ గెలిస్తే బ్రతుకుతుందని చెప్పారు. అమరవీరుల స్థూపం కడితే అందులో కూడా కమిషన్ తీసుకున్నారని మండిపడ్డారు. యువతకి ఉద్యోగలు లేవు, నిరుద్యోగ భృతి లేదు, వారి జీవితాలు చీకట్లో పెట్టాడని వ్యాఖ్యలు చేసింది. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు చాలా బాగున్నాయి.. కాంగ్రెస్ గెలవబోతుందని తెలిపారు. కాంగ్రెస్ మీకు ఆరు గ్యారెంటీలు ఇచ్చింది.. మీరు కాంగ్రెస్ ఓటు గ్యారెంటీ ఇచ్చి కేసీఆర్ కు పోటు పొడవండని విజయశాంతి అన్నారు.