Revanth Reddy: ఢిల్లీలో మోదీ, గల్లీలో కేడీ ఇద్దరూ ఒక్కటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికల ప్రచారంలో భాగంగా కల్వకుర్తిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగిరినపుడే మన గౌరవం పెరుగుతుందని అన్నారు. బీఆర్ఎస్ నేతలు బరితెగించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇక్కడ కట్టిన సాగునీటి ప్రాజెక్టులు, రహదారుల అభివృద్ధి కాంగ్రెస్ హయాంలో జరిగిందేనని రేవంత్ తెలిపారు. కేసీఆర్ నీళ్లు ఇచ్చింది నిజమే అయితే.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు పాడావు పడిందని ప్రశ్నించారు.
Read Also: AP Congress: ప్రియాంక గాంధీకి ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు లేఖ
Also Read
కేసీఆర్ ను ఆనాడు ఎంపీగా గెలిపించినా… ఈ ప్రాంతానికి చేసిందేం లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ బక్కోడు కాదు లక్ష కోట్లు, 10వేల ఎకరాలు దోచుకున్న బకాసురుడు అని దుయ్యబట్టారు. ప్రజలను నమ్మించి మోసం చేసి కేసీఆర్ రెండుసార్లు సీఎం అయ్యారు.. ఆయన కుటుంబ సభ్యులు మంత్రులు అయ్యారని తెలిపారు. కేసీఆర్ కు చర్లపల్లిలో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తామని విమర్శించారు. ఈ నెల కేసీఆర్ వేసే రైతు బంధు 10వేలే.. వచ్చే నెల కాంగ్రెస్ వస్తే 15వేలు అని రేవంత్ పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర చేసి రైతులకు నష్టం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా సరే.. కాంగ్రెస్ రాగానే మిగిలిన డబ్బులు రైతులకు చెల్లిస్తుందని తెలిపారు.
Read Also: Rajasthan Polling: కోపంలో ఓటర్లు.. పోలింగ్ బూతు వైపు కన్నెత్తి చూడని గ్రామస్తులు
రైతు బంధుకు లేని అడ్డు దళితబంధు, బీసీ బంధు మైనారిటీ బందుకు ఎందుకు అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇందుకు నిరసనగా రేపు అన్ని మండల కేంద్రాల్లో ప్రభుత్వ దిష్టి బొమ్మలను దహనం చేయాలని పిలుపునిస్తున్నట్లు తెలిపారు. దళితబందు, బీసీ బందు, మైనారిటీ బందు ఇచ్చే వరకు… బీఆర్ఎస్ నాయకులను గ్రామాలకు రానివ్వకండని పేర్కొన్నారు. ఢిల్లీలో మోదీ, గల్లీలో కేడీ ఇద్దరూ ఒక్కటేనని విమర్శించారు. బీజేపీకి ఓటు వేస్తే మూసీలో వేసినట్లేనని రేవంత్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Raptee.HV T30: రాప్టీ.హెచ్‌వి T30 ఎలక్ట్రిక్ బైక్.. 150KM రియల్ రేంజ్, కారు ఛార్జర్‌తో ఛార్జింగ్!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
-
Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
-
Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!