Pocharam Srinivas Reddy: చరిత్రను తిరగరాస్తూ బీఆర్ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఘన విజయం సాధించారు. బాన్సువాడ నుంచి పోచారం 23,582 ఓట్లతో గెలిచారు. స్పీకర్ గా ఉంటూ విజయం సాధించడం చాలా అరుదు. కానీ ఈ సంప్రదాయాన్ని ఆయన తిరగరాశారు.
తెలంగాణలో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతుండగా.. ఈ క్రమంలో బీజేపీ తొలి విజయం సాధించింది. నిర్మల్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. ఇదిలా ఉంటే.. బీజేపీ 8 స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పలు నియోజకవర్గాల్లో గెలుపొందింది. భద్రాచలం బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావ్ చివరి రౌండ్ లో పుంజుకొని కాంగ్రెస్ అభ్యర్థి పోడెం వీరయ్య పై విజయం సాధించారు. ఈ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థికి 4280 ఓట్ల మెజార్టీ లభించింది. ఇదిలా ఉంటే.. అంబర్ పేటలో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థిపై సుమారు 3వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
Coal belt: కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం దిశగా దూసుకుపోతోంది. 119 స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ 60ని దాటిన కాంగ్రెస్, స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ తెలంగాణల్లో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేకుండా పోయింది. ఇదిలా ఉంటే సింగరేణితో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న కోల్‌బెల్ట్ నియోజకవర్గాల్లో హస్తం హవా స్పష్టంగా కనిపిస్తోంది.
Revanth Reddy: తెలంగాణ ఇచ్చిన పార్టీగా పేరున్న కాంగ్రెస్ గత తొమ్మిదన్నర ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉంది. నేతలు చేజారిపోవడం, ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో చేరడం కాంగ్రెస్ భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేశాయి. సీన్ కట్ చేస్తే తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ తెలంగాణ వ్యాప్తంగా దూసుకుపోతోంది. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ తెలంగాణల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. ఇక ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ ఇలా పలు ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్‌కి ఎదురులేకుండా పోయింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో ఫలితం వచ్చింది. ఇల్లందు కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య గెలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థి బానోతు హరిప్రియపై గెలుపొందారు. సిట్టింగ్ ఎమ్మెల్యే దాదాపు 18వేలకు పైగా ఓట్లతో ఓటమి పాలయ్యారు.
తెలంగాణలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ లీడింగ్ లో దూసుకుపోతుంది. ఈ క్రమంలో.. ఐదు రౌండ్లు పూర్తయ్యే సరికి ఆరుగురు బీఆర్ఎస్ మంత్రులకు ఎదురుదెబ్బ తగిలింది. అందులో ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, పువ్వాడ అజయ్, నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి మంత్రులు వెనుకంజలో కొనసాగుతున్నారు.
Chennur: రాష్ట్రంలో ఎంతో ఆసక్తి రేపిన చెన్నూర్ నియోజవర్గంలో కాంగ్రెస్ విజయం దిశగా దూసుకుపోతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ వెనుకంజలో ఉన్నారు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేస్తున్న వివేక్ వెంటకస్వామి భారీ ఆధిక్యతను కనబరుస్తున్నారు. కనుచూపు మేరలో కూడా బాల్క సుమన్ కనిపించడం లేదు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా దూసుకెళుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 49 కేంద్రాల్లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపులో చాలాచోట్ల కాంగ్రెస్ అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. నాలుగో రౌండ్ లోనూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. కొడంగల్‌లో ఆధిక్యంలో ఉన్నారు. నాలుగు రౌండ్లు పూర్తయ్యే సరికి 5687 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
తెలంగాణలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఈ క్రమంలో మూడో రౌండ్ ఫలితాలు వెలువడయ్యాయి. కొడంగల్, కామారెడ్డిలో మూడో రౌండ్లో రేవంత్‌రెడ్డికి లీడ్ లో కొనసాగుతున్నారు. కొడంగల్‌లో 4159 ఓట్లు, కామారెడ్డిలో 2354 ఓట్ల ఆధిక్యంలో రేవంత్‌రెడ్డి ఉన్నారు.