తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. ఇవాళ సభలో సభ్యుల చర్చ ఆరోగ్యకరంగా ఉంది.. భవిష్యత్తు కూడా ఇలాగే ఉండాలన్నారు. సభలో వ్యక్తిగత దూషణలు ఉండకుండా చూడాలి.. మార్షల్ కి పని చెప్పకుండా పని చేద్దామని కూనంనేని తెలిపారు. ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనే భావన కలిగేలా కేటీఆర్ మాట్లాడారని ఆయన పేర్కొన్నారు. ఇది మంచిది కాదు అని తన ఉద్దేశమన్నారు. తక్కువ రోజులు కాకుండా.. ఎక్కువ రోజులు సభ జరపండి.. ఆరు గ్యారంటీల అమలు చేయండని తెలిపారు.
Tiger Attack: సిరిసిల్లలో చిరుత సంచారం.. భయాందోళనలో ప్రజలు..
వైఎస్ చాలా హామీలు ఇచ్చి.. అమలు చేశారని కూనంనేని సాంబశివరావు తెలిపారు. మీరు కూడా అలాగే ఇచ్చిన హామీలు అమలు చేయండని పేర్కొన్నారు. కమిట్ మెంట్ తో ప్లానింగ్ ఇచ్చిన హామీలు అమలు చేయండని అన్నారు. లక్ష కోట్లతో ప్రాజెక్టు కడితే.. 10 వేల కోట్లే ఉపయోగంలోకి వస్తున్నాయని తెలిపారు. మిగిలినవి ఎటు వెళ్తున్నాయో అర్థం కాలేదు.. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అలా కాకుండా చూడాలని తెలిపారు. మీ ప్రభుత్వం ఏడాది కూడా ఉండదు అంటున్నారు.. ఇది మంచి పద్ధతి కాదు.. మళ్ళీ కొనడం మొదలు పెడతారా అని ప్రశ్నించారు. ఇలాంటి అతి ఉత్సాహం మాటలుపనికి రాదని అన్నారు.
Guntur Kaaram: దిద్దుబాటు చర్యలా? మూడో పాట అప్పుడే బయటకి వస్తుందా?
ప్రజల ఆలోచన పక్కదారి పెట్టె అంశం గత పదేళ్ళలో చేశారని కూనంనేని ఆరోపించారు. కొనుగోలు.. అమ్మకాలు చాలా చూశాం.. అమ్ముడు పోయిన వాళ్ళు ఒక్కడు కూడా అసెంబ్లీకి రాలేదని విమర్శించారు. ప్రజలు గమనిస్తున్నారు.. ఎమ్మెల్యేల కొనుగోలు చేసి తప్పు చేసింది టీఆర్ఎస్సేనన్నారు. దాంతో నెగిటివ్ వచ్చింది.. స్వేచ్ఛ లేకుండా పోయిందని తెలిపారు. ఉద్యమ పార్టీ అధికారంలోకి వచ్చి.. 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు ఎంత మంది ఎన్ని రోజులు హౌస్ అరెస్ట్ అయ్యారో లెక్క బయట పెట్టండని తెలిపారు. ప్రజలు పంజరం నుండి బయట పడ్డట్టు ఫీల్ అవుతున్నారని అన్నారు.
ధర్నాలు చేసే అవకాశం లేదు.. సమ్మెలు చేస్తే ఉద్యోగాలు తీసేశారని కూనంనేని తెలిపారు.