ఎల్.బి నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలు తొందర పడి మాట్లాడొద్దని సూచించారు. కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకు ఒత్తిడి తీసుకొద్ధామని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాతే బలమైన ప్రతిపక్షంగా మన గొంతు వినిపిద్దామని చెప్పారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిని హుందాగా స్వీకరిద్ధామని సుధీర్ రెడ్డి తెలిపారు.
Read Also: Revanth Reddy: ఎంఐఎం ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
కాగా.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల వైపు ఉండాలనే భావజాలంతో తాము పని చేస్తామని సుధీర్ రెడ్డి అన్నారు. ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు చేస్తామని తెలిపారు. మరోవైపు.. తాను పార్టీ మారుతున్నానని వస్తున్న ప్రచారంను ఖండిస్తున్నట్లు సుధీర్ రెడ్డి చెప్పారు. ఈ వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు. ప్రజాసేవ చేయడానికి పార్టీ మారాల్సిన అవసరం లేదని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ మారరని సుధీర్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: Somajiguda: యశోద ఆస్పత్రి వద్ద మహిళా కార్యకర్తలు ఆందోళన..