హైదరాబాద్ లోని సోమాజిగూడ యశోద ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్.. తుంటి నొప్పితో ఆ ఆస్పత్రిలో సర్జరీ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను పరామర్శించేందుకు ప్రముఖ నేతలు వచ్చి వెళ్తున్నారు. అయితే.. తాజాగా కేసీఆర్ ను చూడటానికి బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆస్పత్రి ముందు జై కేసీఆర్, జై రామన్న అంటూ నినాదాలు చేశారు.
సంగారెడ్డిలో బీఆర్ఎస్ కృతజ్ఞత సభలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దురదృష్టవశాత్తు మన ప్రభుత్వం ఏర్పడలేదు.. మనం కుంగిపోవాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చారు.. వాళ్ళు మనకంటే బాగా చేయాలని కోరుకుందామని తెలిపారు. అధికార పార్టీ వాళ్ళు మన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారని ఆరోపించారు. వాళ్ళు కొన్ని దుష్ప్రచారాలు చేశారు.. ప్రజలు నమ్మారు వాళ్ళకి అధికారం ఇచ్చారని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు…
State Finance Corporation send notices to Jeevan Reddy: ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. 20 కోట్ల రుణాన్ని వడ్డీతో సహా చెల్లించాలని మామిడిపల్లిలోని ఆయన ఇంటికి రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు అతికించారు. జీవన్ రెడ్డితో పాటు గ్యారెంటీ సంతకాలు పెట్టిన మరో నలుగురికి కూడా అధికారులు నోటీసులు జారీ చేశారు. నిర్ణీత సమయంలో రుణం చెల్లించకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బీఆర్ఎస్ మాజీ…
హైదరాబాద్ సోమాజీగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రిని కేసీఆర్ ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని వైద్యులు చెప్పారని ఆయన తెలిపారు.
సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎంకేసీఆర్ను తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అక్కడి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. మారుతున్న రాజకీయ సమీకరణాల వల్ల పోలికల్ హీట్ పెరిగిపోతుంది. తాజాగా వెల్గటూర్ ఎంపీపీ కూనమల్ల లక్ష్మిపై అవిశ్వస తీర్మానం ప్రవేశపెట్టారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని 15 మంది ఎంపీటీసీల్లో అవిశ్వసానికి 10 మంది ఎంపిటీసీలు మద్దతు పలికారు. జగిత్యాల ఆర్డీవో ఆఫీసులో ఎంపిటీసీలు తమ అవిశ్వాస తీర్మాన పత్రాన్ని సమర్పించారు. Also Read: Google Most Search in India 2023: ఈ ఏడాది గూగుల్లో అత్యధికంగా వెతికింది వీటికోసమే…
Gutha Sukender Reddy: తాను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందన్నారు. తాను పార్టీ మారాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తాను రాజ్యాంగ శాసన మండలి చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని, తనకు ఏ పార్టీతో సంబంధం లేదని చెప్పారు.
హన్మకొండ హంటర్ రోడ్డులోని సీఎస్ఆర్ గార్డెన్స్ లో బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ అధ్యక్షతన వర్ధన్నపేట బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇటీవల మరణించిన జనగామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పాగాల సంపత్ రెడ్డి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం అరూరి రమేష్ మాట్లాడుతూ.. 2013లో నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్నప్పటినుండి పార్టీ బలోపేతానికి…
Bhatti Vikramarka: పాత్రికేయుల సమస్యలపై కూడా పోరాడుతామని, పరిష్కరిస్తామని ఉప ముఖ్యమంత్రి, ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఉమ్మడి జిల్లాలో 10 స్థానాలకు 9 స్థానాలు కాంగ్రెస్ కు ఇచ్చినందుకు జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక హామీల అమలుకు కౌంట్ డౌన్ షురూ అయ్యిందని ఆరోపించారు. హామీలు అమలు చేసేంత వరకు వదిలేది లేదు.. వెంటాడుతాం.. పోరాడుతామని అన్నారు. ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు.. ఇది చిన్న విరామం మాత్రమే.. ఆ తర్వాత రెట్టించిన వేగంతో ముందుకు వెళ్తామని తెలిపారు.