తెలంగాణలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఈ క్రమంలో రెండో రౌండ్ ఫలితాలు వెలువడయ్యాయి. రెండో రౌడ్లో గోషామహల్లో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్‌కు 2800 ఓట్ల ఆధిక్యం ఉంది. మధిరలో రెండో రౌండ్ పూర్తయ్యేసరికి 4,137 ఓట్ల ఆధిక్యంలో భట్టి విక్రమార్క ఉన్నారు. కల్వకుర్తిలో బీఆర్ఎస్ అభ్యర్థికి 145 ఓట్ల ఆధిక్యంలో ఉండగా.. ఇబ్రహీంపట్నంలో రెండో రౌండ్ పూర్తి అయ్యే సరికి ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి ఉన్నారు.
Congress Leading in Telangana Elections Counting: తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆసక్తికరంగా సాగుతోంది ఈ ఉదయం 8 గంటలకు మొదలైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇప్పుడు కొనసాగుతోంది ముందుగా పోస్టల్ బ్యాలెట్ లను లెక్కించారు తర్వాత ఎనిమిదిన్నర గంటల నుంచి మొదటి రౌండ్ లెక్కింపు మొదలుపెట్టారు అధికారులు అయితే ఈ లెక్కింపులో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ముందంజలో ఉందని సమాచారం అందుతుంది దాదాపుగా అన్ని జిల్లాలలోనూ కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపిస్తోంది…
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కింపు ప్రారంభమైంది. గతానికి భిన్నంగా ఈసారి ఓట్ల లెక్కింపలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఓట్ల లెక్కింపు సమయంలో పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకూ ఎప్పటికప్పుడు స్పెషల్ బ్రాంచ్‌కు తెలియజేయాలని చెప్పారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు మొత్తం రెడీ అయింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు గానూ కాసేపట్లో ఓట్ల లెక్కింపు స్టార్ట్ అవుతుంది. ఓట్ల లెక్కింపుకు అధికార యంత్రాంగం అన్ని సిద్ధం చేసింది.
మంత్రి కేటీఆర్ మరో ట్వీట్ చేశారు. "హ్యాట్రిక్ లోడింగ్ 3.o.. గెట్ రెడీ సెలబ్రేటీ గాయ్స్" అని ట్వీట్ చేశారు. దీంతో బీఆర్ఎస్ గెలుపుపై మరింత విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. ఈ ఉదయం కూడా ఒక ట్వీట్ చేశారు.
బీఆర్ఎస్ నేత దాసోజ్ శ్రవణ్ తమ పార్టీ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. ముమ్మాటికీ 70 సీట్లకు పైగా బీఆర్ఎస్ గెలుస్తుందని దాసోజు శ్రవణ్ అన్నారు. మూడవ సారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు. తెలంగాణ ప్రజలతో కేసీఆర్ ది పేగు బంధం అని పేర్కొ్న్నారు. ఎగ్జిట్ పోల్ కు ఎగ్జాక్ట్ పోల్స్ కు మధ్య చాలా తేడా ఉంటుందని ఆరోపించారు. కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉన్నాడని చెప్పారు. కాంగ్రెస్ నేతలు లేకి తనం చూపిస్తున్నారు.. చిల్లర…
రాత్రి 11 గంటల వరకు పోలింగ్ నడిచిందని సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. పోలింగ్ నడుస్తున్న సమయంలో ఎగ్జిట్ పోల్స్ కు ఎన్నికల కమీషన్ ఎలా అనుమతించారు..? అని ప్రశ్నించారు. సత్తుపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా సాయంత్రం 5 గంటలు దాటిన తరువాత 30 వేలకు పైగా ఓట్లు పోల్ అయ్యాయని పేర్కొన్నారు. అలాంటప్పుడు ఎగ్జిట్ పోల్ ఎలా సరైందని విమర్శించారు. నూటికి నూరు శాతం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారు.. సత్తుపల్లిలో నాల్గోసారి విజయం సాధిస్తున్నట్లు ధీమా…
Durgam Chinnaiah: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే పై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై నెన్నెల పోలీసులు కేసు నమోదు చేశారు.