డీజీపీ రవిగుప్తాను కాంగ్రెస్ నేతలు కలిశారు. ప్రభుత్వం కూలిపోతోంది అని కామెంట్స్ చేసిన బీజేపీ, బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో డీజీపిని కలిసిన వారిలో.. పీసీసీ ప్రధాన కార్యదర్శులు కైలాశ్ నేత, చారుకొండ వెంకటేశ్, మధుసూదన్ రెడ్డిలు ఉన్నారు. వ్యాఖ్యలు చేసిన వారిలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర రెడ్డి ఉన్నారు.
Nizamabad: ఆర్మూర్ బీఆర్ఎస్‌లో ముసలం
అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ… బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడి 100 గంటలు కాలేదు.. కేంద్రంలో ఉన్నా బీజేపీ, బీఆర్ఎస్ లు ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చూస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేంద్రంలా బీఆర్ఎస్ పని చేస్తుందని అన్నారు. ప్రభుత్వం ఏర్పడగానే మహిళలకు ఫ్రీ బస్సు, ఆరోగ్య శ్రీ 10 లక్షల వరకు చేసాం.. పేదల రక్తం తాగే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రజల తీర్పును అగౌరవ పరుస్తున్నారని దుయ్యబట్టారు. దళిత సబ్ ప్లాన్ అమలు చేయకపోతే దొరల బూట్లు నాకిన కడియం ఇప్పుడు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Revanth Reddy: ఎంఐఎం ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి.. వీరి దుర్మార్గాలను అడ్డుకోండని కాంగ్రెస్ నేతలు తెలిపారు. కాళేశ్వరం, ధరణి, ఇంటర్మిడియట్, ప్రశ్నా పత్రాల కుంభకోణాలు బయటకు రాబోతున్నాయి.. ఆ భయంతోనే ప్రభుత్వం కూలిపోతుందని మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వాన్ని కూల్చివేసి అడ్డదారిలో ప్రభుత్వంలోకి రావాలని చూస్తే సమాజం చూస్తుంది.. నిరుద్యోగులు ఆందోళన చెందద్దు.. త్వరలోనే ఉద్యోగాల భర్తీ జరుగుతుందని తెలిపారు. తమకు ఇంకా 5 సంవత్సరాలు ఉందని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.