తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్టోబర్ 9వ తారీఖు నుంచి రాష్ట్రంలో కోడ్ అమల్లోకి వచ్చింది. దాదాపు రెండు నెలల పాటు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నది.
రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మనస్ఫూర్తిగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాజకీయాల్లో మార్పు వచ్చింది.. తెలంగాణలో భాష మారబోతోంది.. ఇక, నీచమైన రాజకీయాలకు స్వస్తి పలకాలి అని ఆయన కోరారు.
ఒక సిట్టింగ్ సీఎంను.. కాబోయే సీఎం అంటున్న ఇద్దరినీ ఓడించిన ఘనత బీజేపీ దే అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్, రేవంత్ రెడ్డినీ ఓడించిన వెంకట రమణ రెడ్డి విజయంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అభినందనలు తెలిపారు అని ఆయన పేర్కొన్నారు.
భారీ మెజార్టీకి మారుపేరు హరీష్ రావు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గత రెండుసార్లు సిద్ధిపేట నుంచి భారీ మెజార్టీతో హరీష్ రావు గెలుపొందారు. అయితే ఈసారి హరీష్ రావు వెనకపడిపోయారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023లో అత్యధిక మెజార్టీ సాధించిన అభ్యర్థిగా కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి కెపి వివేకానంద నిలిచారు. వివేకానంద 85 వేల 576 ఓట్ల మెజార్టీ సాధించారు. Also Read: Telangana Elections 2023: పీవీ నరసింహారావు రికార్డును అధిగమించిన శ్రీధర్ బాబు! కుత్బుల్లాపూర్…
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీని 40 స్థానాల్లోపే పరిమిత చేసిన కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. 64 స్థానాలను గెలిచిన కాంగ్రెస్.. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల నుంచి మొత్తం 33 మహిళలు పోటీ చేయగా.. చాలా నియోజకవర్గాల్లో మహిళలకే ఓటర్లు పట్టం కట్టారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన మహారాణులెవరో తెలుసుకుందాం..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుజారాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కౌశిక్ రెడ్డి.. బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై 17,158 ఓట్ల మెజారిటీతో గెలిచారు. దాంతో ఇక్కడ ‘శవయాత్ర’ తప్పింది. ప్రచారంలో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ తాను ఓడిపోతే హుజారాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ తన శవయాత్రకు రావాలని కోరిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారం చివరి రోజున పాడి…
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు దాదాపు ముగిసింది. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్‌కు అవసరమైన మేజిక్ ఫిగర్‌ను అలవోకగా అందుకుంది. కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మరోవైపు వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలన్న బీఆర్ఎస్ ఆశలు ఆవిరైపోయాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజారాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి విజయం సాధించారు. బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై కౌశిక్ రెడ్డి గెలిచారు. విజయం అనంతరం హుజురాబాద్ ప్రజలకు కౌశిక్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈటెల ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. ఈటెలకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చానని.. కౌశిక్‌తో ఇలాగే ఉంటదన్నారు. ‘నా గెలుపుకు కారణమైన హుజురాబాద్ ప్రజలకు కృతజ్ఞతలు. ఈటెల రాజేందర్ ఇప్పటికైనా నోరు…
Bandi Sanjay Wants Re Counting in Karimnagar: కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితంపై హైడ్రామా కొనసాగుతోంది. బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్.. బీజేపీ ఎంపీ బండి సంజయ్ పై 326 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే కౌంటింగ్‌లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న బండి సంజయ్.. రీకౌంటింగ్ కోరారు. దాంతో అధికారులు ఫలితాన్ని అధికారికంగా ప్రకటించలేదు. కౌంటింగ్‌లో ఏం జరుగుతుందో అర్థంకాని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న గంగుల కమలాకర్.. కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు.…
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ సత్తా చాటింది.. అయితే, కాంగ్రెస్ వేవ్‌లోనూ దాదాపు 40 స్థానాలను అధికార బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది.. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మరోసారి అవకాశం కల్పించడమే బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణమే ప్రచారం ఉంది.