కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. పదేళ్లలో టీఆర్ఎస్.. కాంగ్రెస్ నేతలను కష్టాలకు గురిచేసిందని ఆరోపించారు. టీఆర్ఎస్ దళిత ముఖ్యమంత్రి అన్నారు చేయలేదని విమర్శించారు. మరోవైపు.. కిషన్ రెడ్డి ఆరు గ్యారెంటీస్ అమలు చేయరు అని అంటున్నారు.. కర్ణాటక వెళ్లి చూడాలని తెలిపారు. కొందరు ప్రభుత్వం ఆరు నెలలు కూడా ఉండదు అని మాట్లాడుతున్నారు.. కేంద్ర ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అన్నారు.. ఏమైందని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు.
Read Also: Congress: డీజీపీని కలిసిన కాంగ్రెస్ నేతలు.. బీజేపీ, బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు
రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని హామీలు పూర్తి చేస్తామని వీహెచ్ తెలిపారు. ఇప్పటికే రెండు హామీలు అమలు చేస్తున్నాము.. మహిళలకు ఫ్రీ బస్ పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కాంగ్రెస్ కల్చర్ అని వీహెచ్ చెప్పారు. కాంగ్రెస్ పేదలకు భూములు ఇస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ధనవంతులకు బీఆర్ఎస్ న్యాయం చేసిందని విమర్శించారు.
Read Also: Karnataka: రాజ్ భవన్‌కు బాంబు బెదిరింపు
కేసీఆర్ ఇంటికో ఉద్యోగం, మూడెకరాల భూమి అన్నారు, ఇవ్వలేదని ప్రశ్నించారు. ధరణి పోర్టల్ ద్వారా భూములు లాగేశారు.. దాన్ని రద్దు చేయాలి. రెవెన్యూ శాఖలో తప్పులు జరిగాయని వీహెచ్ తెలిపారు. మరోవైపు.. ప్రభుత్వం పడిపోతుంది అనే స్టేట్మెంట్ పై కామెంట్ మనేయాలని వీహెచ్ పేర్కొన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ అందరిని మోసం చేసింది.. ప్రజలు కాంగ్రెస్ ను నమ్మారు.. అందుకే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని వీహెచ్ తెలిపారు.