నిజామాబాద్: బీఆర్ఎస్ పార్టీలో ముసలం నెలకొంది. ఆర్కూర్ బీఆర్‌ఎస్ మున్సిపల్ ఛైర్ పర్సన్ పండిత్ వినీత్‌పై ఆ పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాసానికి సిద్దమయ్యారు. ఆయనకు వ్యతిరేకంగా26 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్ల సమావేశమయ్యారు. అంతేకాదు మంగళశారం వారు జిల్లా కలెక్టర్‌ను కలిసి పండిత్ వినీత్‌పై అవిశ్వాస తీర్మాణం పెట్టెందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. మున్సిపల్ ఛైర్ పర్సన్ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని వారు తమ వినతి పత్రంలో ఆరోపించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.