Kishan Reddy: పార్లమెంట్ ఎన్నికలకు రాష్ట్రంలో ఒంటరిగానే పోరాడుతామని, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను అధిగమించి సీట్లు పొందుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఎంత దూరమో, కాంగ్రెస్ కూడా అంతే దూరమన్నరు. ఈ నెల చివరి వారంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రానికి వస్తున్నారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికలపై కార్యాచరణ ఆ సమావేశంలో నిర్ణయం అవుతుందని తెలిపారు. వికసిత భారత్ సంకల్ప యాత్రలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాల్గొంటారని తెలిపారు. ఇతర పార్టీల ప్రజా ప్రతినిధులు పాల్గొన్న పాల్గొనక పైన బీజేపీ శ్రేణులు మాత్రం పాల్గొనాలన్నారు.
Read also: BMS Auto Union: సీఎం ఆటోడ్రైవర్లను ఆదుకోవాలి.. లేదంటే ప్రజా భవన్ ముట్టడిస్తాం..
బీజేపీ నుండి గెలిచిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేస్తారని క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల పైన ఉమ్మడి పది జిల్లాల వారీగా రివ్యూ ఉంటుందని అన్నారు. రాష్ట్ర స్థాయి నేత ఆ రివ్యూ లో పాల్గొంటారన్నారు. వెంటనే పార్లమెంట్ ఎన్నికలకి సన్నద్ధం కావాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. విశ్రాంతి తీసుకోవడానికి సమయం లేదని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని వస్తున వార్తలపై కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంతనో బీఆర్ఎస్ కూడా తమకు అంతే అని స్పష్టం చేసిన ఆయన ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పారు.
Youtuber Chandu Sai: ప్రముఖ యూట్యూబర్ ‘పీకే’ చందు సాయి అరెస్ట్!