ఇదిలా ఉంటే, ఈ ఎన్‌కౌంటర్‌పై అక్షయ్ షిండే తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్‌ని ఈ రోజు బాంబే హైకోర్టు విచారించింది. మహారాష్ట్ర పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఈ ఎన్‌కౌంటర్‌ని నమ్మడం కష్టంగా ఉంది
అండం, వీర్య దానం ఇచ్చిన మహిళకు పిల్లలపై ఎటువంటి చట్టపరమైన హక్కులు ఉండవని.. జీవ సంబంధమైన తల్లిదండ్రులుగా చెప్పుకోలేరని బాంబే హైకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. కాగా.. తన ఐదేళ్ల చిన్నారికి సందర్శన హక్కు కల్పించాలని కోరుతూ ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ మిలింద్ జాదవ్‌తో కూడిన హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ విచారించింది.
Bombay High Court: భారత ప్రభుత్వం ‘‘దేశం వదిలి వెళ్లాలి’’ అని నోటీసులు జారీ చేసినప్పటికీ యెమెన్‌కి చెందిన వ్యక్తి ఇండియాలో ఉండటంపై బాంబే హైకోర్టు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేసింది.
పూణె కారు ప్రమాదంలో మైనర్ నిందితుడికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మే 19న మద్యం మత్తులో పూణెలో వేగంగా కారు నడిపి ఇద్దరు టెకీల మరణానికి బాలుడు కారణమయ్యాడు.
PFI:నిషేధిత ఉగ్రవాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ)తో సంబంధాలున్నాయంటూ 2022లో మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఎటిఎస్) అరెస్టు చేసిన ముగ్గురు వ్యక్తులకు బాంబే హైకోర్టు మంగళవారం బెయిల్ నిరాకరించింది.
నిద్రించే హక్కు మానవ ప్రాథమిక అవసరం అని, దానిని (నిద్రించే హక్కు) ఉల్లంఘించలేమని బాంబే హైకోర్టు పేర్కొంది. ఇటీవల ఓ వ్యక్తి విచారణలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వ్యవహరించిన తీరుపై బాంబే హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసులో న్యాయమూర్తులు రేవతి మోహితే, దేరే, మంజుషా దేశ్ పాండేలతో కూడిన ధర్మాసనం ఈడీపై మండిపడింది. మనీలాండరింగ్ కేసులో గత ఏడాది ఆగస్టులో గాంధీధామ్ నివాసి రామ్ కొతుమల్ ఇస్రానీ (64)ని ఈడీ అరెస్టు చేసింది.…
మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ రాణా క్యాస్ట్ సర్టిఫికెట్ కేసులో నేడు సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఆమె 2019లో ఎస్సీ కేటగిరిలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అయితే, ఆమె ఎస్సీ సర్టిఫికెట్‌ను చట్టవిరుద్ధంగా పొందారనే కారణంతో దాన్ని బాంబే హైకోర్టు రద్దు చేసింది. దీంతో ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తన కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ లోక్‌సభ ఎంపీ నవనీత్ కౌర్…
Pradeep Sharma: 2006లో గ్యాంగ్‌స్టర్ ఛోటా రాజన్ సన్నిహితుడు రామ్‌నారాయణ్ గుప్తా బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో మాజీ పోలీసు ప్రదీప్ శర్మను దోషిగా నిర్ధారించి బాంబే హైకోర్టు మంగళవారం జీవిత ఖైదు విధించింది. జస్టిస్ రేవతి మోహితేదేరే, గౌరీగాడ్సేలతో కూడిన డివిజన్ బెంజ్ ‘ఫేక్ ఎన్‌కౌంటర్’ కేసులో ఆయనను దోషిగా తేల్చింది. ఈ కేసులో సెషన్స్ కోర్టు 2013లో ప్రదీప్ శర్మ నిర్దోషి అని చెప్పిన తీర్పును హైకోర్ట్ తప్పుపట్టింది.
Bombay High Court: అర్ధరాత్రి ఒంటిగా ఉన్న మహిళ ఇంటి తలుపు తట్టిని అధికారి కేసును బాంబే హైకోర్టు విచారించింది. తప్పుడు ప్రవర్తన కారణంగా అతనిపై విధించిన జరిమానాను రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. జస్టిస్ నితిన్ జామ్‌దార్, ఎంఎం సతయేలతో కూడిన డివిజన్ బెంచ్ మార్చి 11న ఈ కేసును విచారించింది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్)కి చెందిన కానిస్టేబుల్ ఈ ఘటనకు పాల్పడ్డాడని, అంతకుముందు మద్యం సేవించి ఉన్నాడని, తన సహోద్యోగి అయిన మహిళ…
మావోయిస్టుల లింకు కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ మంగళవారం నిర్దోషులుగా ప్రకటించింది. తమను దోషులుగా ప్రకటిస్తూ 2017 సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సాయిబాబా, ఇతరులు చేసిన అప్పీల్పై కోర్టు తీర్పు వెలువడింది.