Bombay High Court: అండం, వీర్య దానం ఇచ్చిన మహిళకు పిల్లలపై చట్టపరమైన హక్కు లేదు..
- అండం.. వీర్య దానం ఇచ్చిన మహిళకు పిల్లలపై ఎటువంటి చట్టపరమైన హక్కులు ఉండవు
- జీవ సంబంధమైన తల్లిదండ్రులుగా చెప్పుకోలేరని బాంబే హైకోర్టు తీర్పు
- పిల్లలకు వారు జీవసంబంధ తల్లిదండ్రులుగా చెప్పడం కుదరదని స్పష్టం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అండం, వీర్య దానం ఇచ్చిన మహిళకు పిల్లలపై ఎటువంటి చట్టపరమైన హక్కులు ఉండవని.. జీవ సంబంధమైన తల్లిదండ్రులుగా చెప్పుకోలేరని బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. కాగా.. తన ఐదేళ్ల చిన్నారికి సందర్శన హక్కు కల్పించాలని కోరుతూ ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ మిలింద్ జాదవ్‌తో కూడిన హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ విచారించింది. సరోగసీ ద్వారా పుట్టిన తన కుమార్తెలు అండం దానం చేసిన తన భర్త, చెల్లెలుతో కలిసి జీవిస్తున్నారని ఆ మహిళ తన పిటిషన్‌లో పేర్కొంది.
Bangladesh: హిందూ నేతలని కలిసిన బంగ్లా తాత్కాలిక అధినేత మహమ్మద్ యూనస్..
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
2018లో సరోగసీ మహిళ ద్వారా పిల్లలు పుట్టగా.. 2019లో కవల బాలికలు జన్మించారు. పిటిషనర్ సోదరికి అండాలను దానం చేసినందున.. ఆమెకు జీవసంబంధమైన తల్లిదండ్రులుగా గుర్తించే చట్టబద్ధమైన హక్కు ఉందని పిటిషనర్ భర్త వాదించాడు. కాగా.. 2019లో పిటిషనర్ సోదరి కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. 2019 నుంచి 2021 మార్చి వరకు ఇద్దరు పిల్లలతో కలిసి పిటిషనర్, ఆమె భర్త కలిసే ఉన్నారు. ఆ తరువాత వైవాహిక బంధంలో విభేదాల కారణంగా 2021లో భార్యకు చెప్పకుండా ఇద్దరు పిల్లలతో కలిసి భర్త వేరే ఇంటికి వెళ్లిపోయాడు.
DSC Exam Key: తెలంగాణ డీఎస్సీ ప్రిలిమినరీ కీ విడుదల
అక్కడ రోడ్డు ప్రమాదంతో కుంగుబాటుకు గురైన తన మరదలు.. పిల్లల బాగోగులను చూసుకునేందుకు తనతోనే ఉంటుందని పిటిషనర్ భర్త చెప్పడంతో పిటీషనర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం ఆమె హైకోర్టును ఆశ్రయించగా ఈ తీర్పు వెలువడింది. కాగా.. 2018లో పిల్లలు గర్భం దాల్చినందున సరోగసీ చట్టానికి 2021 సవరణ వర్తించదని.. దానికి బదులుగా ICMR మార్గదర్శకాలు వర్తిస్తాయని హైకోర్టు నియమించిన అమికస్ ధర్మాసనానికి తెలిపారు. కవలలకు జీవసంబంధమైన తల్లిగా చెప్పుకునే హక్కు చెల్లెలికి లేదని హైకోర్టు పేర్కొంది. అందువల్ల ప్రతి వారాంతంలో మూడు గంటల పాటు భార్య కుమార్తెలను కలిసేందుకు అనుమతించాలని హైకోర్టు ఆదేశించింది.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!