పూణె కారు ప్రమాదంలో మైనర్ నిందితుడికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మే 19న మద్యం మత్తులో పూణెలో వేగంగా కారు నడిపి ఇద్దరు టెకీల మరణానికి బాలుడు కారణమయ్యాడు. అయితే ప్రమాదం జరిగిన గంటల వ్యవధిలోనే బాలుడికి బెయిల్ మంజూరు అయింది. అలాగే ప్రమాదంపై ఒక వ్యాసం రాసుకుని రమ్మని న్యాయస్థానం సూచించింది. ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా పెద్ద దుమారం చెలరేగింది. సోషల్ మీడియా వేదికగా నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టి.. నిందితుడికి బెయిల్ రద్దు చేసింది. తిరిగి ఇన్ని రోజులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఇది కూడా చదవండి: KCR: పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..
17 ఏళ్ల బాలుడికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టానికి కట్టుబడి ఉన్నామని తెలిపింది. నేరం తీవ్రత ఉన్నప్పటికీ జువైనల్ జస్టిస్ యాక్ట్ ప్రకారమే నిందితుడికి బెయిల్ ఇచ్చినట్లు వెల్లడించింది.
ఇదిలా ఉంటే ఈ కేసులో జరిగిన పరిణామాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. నిందితుడికి బెయిల్ మంజూరు అయిన దగ్గర నుంచి అన్నింటిలో అక్రమాలు జరిగినట్లు కమిటీ గుర్తించింది. ఇక నిందితుడి మెడికల్ రిపోర్టు మార్చినందుకు వైద్యులపై ప్రభుత్వం వేటు వేసింది. అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై వేటు వేసింది. అంతేకాకుండా బెయిల్ మంజూరు చేసిన కోర్టు తీరుపై కూడా దర్యాప్తు జరుగుతోంది. బెయిల్ విషయంలో కూడా అక్రమాలు జరిగినట్లుగా కమిటీ గుర్తించినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: IND vs ENG : వర్షం పడి సెమీస్ మ్యాచ్ రద్దైతే..? టీమిండియా నేరుగా..