Badlapur Encounter: ‘‘ఇది ఎన్‌కౌంటర్ కాదు’’.. బద్లాపూర్ కేసులో హైకోర్టు ఆగ్రహం..
- బద్లాపూర్ ఎన్‌కౌంటర్‌పై హైకోర్టు అనుమానం..
- ఇది ఎన్‌కౌంటర్ కాదు..
- నలుగురు వ్యక్తులు ఒకర్ని కంట్రోల్ చేయలేరా..?
- మహారాష్ట్ర పోలీసులు.. ప్రభుత్వంపై హైకోర్టు ప్రశ్నల వర్షం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Badlapur Encounter: బద్లాపూర్ ఎన్‌కౌంటర్ మహారాష్ట్రలో సంచలనంగా మారింది. గత నెలలో బద్లాపూర్‌లోని ఓ స్కూల్‌లో స్వీపర్‌గా పనిచేస్తున్న అక్షయ్ షిండే అనే వ్యక్తి నాలుగేళ్ల వయసు ఉన్న ఇద్దరు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ముంబైలో ఆగ్రహావేశాలకు కారణమైంది. ఆందోళనకారులు బద్లాపూర్ రైల్వే స్టేషన్, రోడ్లను ముట్టడించారు. ఇదిలా ఉంటే నిందితుడిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం నిందితుడిని జైలు నుంచి బయటకు తీసుకువచ్చే సమయంలో ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు చెబుతున్న దాని ప్రకారం.. నిందితుడు గన్ తీసుకుని కాల్పులు జరపడంతో, ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా తాము ఫైర్ చేశామని చెప్పారు.
ఇదిలా ఉంటే, ఈ ఎన్‌కౌంటర్‌పై అక్షయ్ షిండే తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్‌ని ఈ రోజు బాంబే హైకోర్టు విచారించింది. మహారాష్ట్ర పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఈ ఎన్‌కౌంటర్‌ని నమ్మడం కష్టంగా ఉంది, ఇందులో ఏదో తిరకాసు ఉంది. ఒక సామాన్యుడు రివాల్వర్ లాగా పిస్టల్‌ని కాల్చలేడు. ఒక బలహీనమైన వ్యక్తి పిస్టల్‌ని లోడ్ చేయలేడు’’ అని కోర్టు సందేహం వ్యక్తం చేసింది. ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అని నిందితుడి తల్లిదండ్రులు ఆరోపించడంతో కోర్టు ఈ విషయాన్ని సీరియస్‌గా పనిగణిస్తోంది.
Also Read
Read Also: DELHI: ప్రభుత్వ భూమిలో “రాణి లక్ష్మీబాయి” విగ్రహ ఏర్పాటు.. భూమి తమదన్న వక్ఫ్ బోర్డు.. చివరికీ..
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా షిండేని హత్య చేశారని పిటిషనర్ పేర్కొన్నాడు. నిందితుడు బలవంతుడు కాదు, అతను ఫస్ట్ ట్రిగ్గర్ నొక్కే లోపు నలుగురు పోలీసులు అతడిని పట్టుకోలేరా..? అని ప్రశ్నించింది. పోలీసులు కథనాన్ని నమ్మడం కష్టంగా ఉందని జస్టిస్ రేవతి మోహితే దేరే, జస్టిస్ పృథ్వీరాజ్ చవాన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ప్రస్తుత కేసులో ఎదరు దోషి అనే విషయాన్ని ఎలా పోలీసులు నిర్ణయిస్తారు. చట్టబద్ధమైన పాలన తప్పనిసరిగా ఉండాలని కోర్టు చెప్పింది. పోలీసులు ఇలాంటి చర్యల్ని ప్రోత్సహించడం ఒక చెడ్డ ఉదాహరణగా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఒక వేళ పారిపోయే పరిస్థితి ఉంటే నిందితుడి కాళ్లపై కాల్చాలని కోర్టు చెప్పింది. నిందితుడు పోలీసుల పైకి మూడు బుల్లెట్లు కాల్చాడని, మీరు ఒక్క పోలీసులకే గాయాలయ్యాయని చెబుతున్నారు..మిగతా ఇద్దరి సంతేంటి..? అని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వాహనంలో ఉన్న నలుగురు పోలీసులు ఒక్క వ్యక్తిని కంట్రోల్ చేయలేకపోయారంటే ఎలా నమ్మాలి..? అని పోలీసుల్ని, ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పోలీసు వాహనం డ్రైవర్‌తో సహా కాల్ డేటా రికార్డ్స్ (సిడిఆర్‌లు) సేకరించాలని కోర్టు రాష్ట్రాన్ని కోరింది. దీనిపై వచ్చే గురువారం విచారణ జరగనుంది.
తాజావార్తలు
-
Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
-
Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
-
Babar Azam: ‘శనగలు అమ్మడానికి వచ్చావా..?’ పాపం బాబర్ ఆజం పరువుపోయిందిగా..
-
AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
-
Drugs Seized : ఒడిశా టూ హైదరాబాద్ ‘డెడ్ డ్రాప్’ డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టు
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!