Bombay High Court: ఒక బాలికను ఫాలో అయ్యాడనే ఒకే ఉదాహరణ అనేది ఐపీసీ సెక్షన్ 354(D) ప్రకారం ఒక బాలికను స్టాకింగ్(వెంబడించడం) చేశాడనే నేరంగా పరిగణించబడటానికి అనుగుణంగా లేదని బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. 14 ఏళ్ల బాలికకు సంబంధించిన కేసులో లైంగిక వేధింపులు, అతిక్రమణకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు 19 ఏళ్ల యువకులకు సంబంధించిన పిటిషన్ల జస్టిస్ జీఏ సనప్ విచారించారు.
Bombay High Court: రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసే హోర్డింగులపై బాంబే హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలపై వారికి ఎలాంటి గౌరవం లేదని వ్యాఖ్యానించింది. ప్రధాన న్యాయమూర్తి డీకే ఉపాధ్యాయం, జస్టిస్ అమిత్ బోర్కర్‌లతో కూడిన ధర్మాసనం మహారాష్ట్ర అంతటా ఏర్పాటు చేసిన అక్రమ హోర్డింగులపై వేసిన పిటిషన్‌ని విచారించింది.
Bombay High Court: ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం.. బిడ్డను తన తల్లి నుంచి వేరు చేయడం ‘‘క్రూరత్వం’’గా పరిగణించబడుతుందని బాంబే హైకోర్టు పేర్కొంది. జల్నాకు చెందిన మహిళ తన అత్తామామలపై నమోదు చేసిన కేసును కొట్టేసేందుకు నిరాకరించింది. ఔరంగాబాద్‌లోని న్యాయమూర్తుల విభా కంకన్‌వాడీ, రోహిత్ జోషిలతో కూడా ధర్మాసనం డిసెంబర్ 11న తన ఉత్తర్వుల్లో.. దిగువ కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ మహిళకు, తన నాలుగేళ్ల కూతురని దూరంగా ఉంచుతున్నట్లు గమనించింది.
live-in relationship: లివ్ ఇన్ రిలేషన్ కొనసాగించడానికి పోలీసుల రక్షణ కోసం పిటిషన్ దాకలు చేసిన జంటపై బాంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు రక్షణ కల్పించడానికి నిరాకరించింది. కలిసి జీవించేందుకు పోలీసులు రక్షణ కల్పించడమేంటని న్యాయమూర్తులు భారతీ డాంగ్రే, మంజుషా దేశ్‌పాండే ధర్మాసనం పేర్కొంది. 19 ఏళ్ల హిందూ యువతిని ప్రభుత్వ షెల్టర్ హోమ్ నుంచి విడుదల చేయాలని కోరతూ 20 ఏళ్ల ముస్లిం యువకుడు దాఖలు చేసిన పిటిషన్‌ని కోర్టు విచారించింది. పిటిషన్‌తో…
కుల రిజర్వేషన్లపై మాట్లాడటం ఏ వర్గానికి వ్యతిరేకంగా పరిగణించబడదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. అటువంటి సందర్భంలో SC-ST చట్టం కింద కేసు నమోదు చేయబడదని తెలిపింది. తాజాగా ఓ మహిళ తన బాయ్‌ఫ్రెండ్‌తో సంబంధాన్ని తెంచుకుంది.
Bombay High Court: ఏకాభిప్రాయంతో మైనర్ భార్యతో సెక్స్ చేసిన అది అత్యాచారంగానే పరిగణించబడుతుందని బాంబే హైకోర్టు తీర్పు చెప్పింది. అలాంటి చర్యలకు సంబంధించిన చట్టపరమైన రక్షణ చట్టం అంగీకరించదని చెప్పింది. తన భార్యపై అత్యాచారం చేసిన వ్యక్తికి 10 ఏళ్ల శిక్షను సమర్థిస్తూ బాంబే హైకోర్ట్ నాగ్‌పూర్ బెంచ్ వ్యాఖ్యానించింది.
Bombay HC: తన కూతురినిచ్చి పెళ్లి చేసిన అత్తపైనే అల్లుడు అత్యాచారం చేసిన ఘటనకు సంబంధించిన కేసుని బాంబే హైకోర్టు విచారించింది. విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
High Court: క్రూరత్వానికి పాల్పడిన కేసులో 20 ఏళ్ల శిక్షను ఎదుర్కొంటున్న కుటుంబానికి బాంబే హైకోర్టు ఊరటనిచ్చింది. క్రూరత్వం, ఆత్మహత్యకు ప్రేరేపించిన వ్యక్తిని, అతడి కుటుంబాన్ని నిర్దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఔరంగబాద్ బెంచ్ తీర్పు చెప్పింది. తన చనిపోయిన భార్య పట్ల క్రూరత్వానికి పాల్పడ్డాడని ఒక వ్యక్తి అభియోగాలు ఎదుర్కొన్నాడు.
ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా కన్నుమూశారు. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాయిబాబా తుదిశ్వాస విడిచారు. ఉద్యమకారుడిగా, రచయితగా, విద్యావేత్తగా పేరు తెచ్చుకున్నారు. అయితే మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని 2014లో సాయిబాబాను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు.