స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాకు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేను ఉద్దేశించి ‘ద్రోహి’ అంటూ సంబోధించిన కేసులో కునాల్ కమ్రాకు న్యాయస్థానం రక్షణ కల్పించింది.
స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌లను కొట్టేయాలని కోరుతూ సోమవారం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ముంబై పోలీసులు ఇప్పటికే మూడు సార్లు సమన్లు జారీ చేశారు. కానీ పోలీసుల విచారణకు మాత్రం కునాల్ హాజరు కాలేదు.
Bombay High Court: జీవిత భాగస్వామిని బెదిరించడం లేదా ఆత్మహత్యకు ప్రయత్నించడం విడాకులకు కారణమే అని బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ కీలక తీర్పు చెప్పింది. తన భార్య ఆత్మహత్య చేసుకుంటానని తన కుటుంబాన్ని బెదిరిస్తోందని ఓ వ్యక్తి ఆరోపించాడు. జీవిత భాగస్వామిని బెదిరించడం అనేది క్రూరత్వం కిందకు వస్తుందని, విడాకులకు ఇవ్వడానికి కారణం అని హైకోర్టు చెప్పింది.
FASTag: ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి వ్యవహారంపై మహారాష్ట్రకు చెందిన వ్యక్తి బాంబే హైకోర్టులో ఒక పిల్ దాఖలు చేశారు. ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనాలకు రెట్టింపు టోల్ వసూలు చేయడం అక్రమమని పేర్కొంటూ ఆ పిటిషన్ దాఖలైంది. అయితే, హైకోర్టు ఈ పిల్ ను తోసిపుచ్చుతూ ప్రభుత్వంతో పాటు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) నిర్ణయానికి మద్దతుగా తీర్పు వెలువరించింది. అయితే ఈ విషయంలో పిటిషనర్ వాదన ప్రకారం, ఫాస్ట్ ట్యాగ్ లేకుండా ప్రయాణించే…
Aurangzeb tomb: మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్(ఔరంగాబాద్) జిల్లాలోని ఖుల్దాబాద్‌లో ఉన్న మొఘల్ పాలకుడు ఔరంగజేబు సమాధిని కూల్చివేయాలని కోరుతూ బాంబే హైకోర్టులో పిల్ దాఖలైంది. ఔరంగజేబు సమాధిని జాతీయ స్మారక చిహ్నాల జాబితా నుండి తొలగించాలని భారత పురావస్తు సర్వే (ASI)ని ఆదేశించాలని కార్యకర్త కేతన్ తిరోద్కర్ తన పిటిషన్‌లో కోర్టుని కోరారు. ఔరంగజేబు సమాధి ఏఎస్ఐ చట్టం 1958లోని సెక్షన్ 3కి అనుగుణంగా లేదని వాదిస్తోంది. ఈ సెక్షన్ కొన్ని పురాతన స్మారక చిహ్నాలను,…
Chahal - Dhanashree: స్టార్ క్రికెటర్ యజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మల విడాకులు కొలిక్కి వచ్చాయి. రేపటిలోగా తీర్పు ఇవ్వాలని బాంబే హైకోర్టు ఫ్యామిలీ కోర్టుని ఆదేశించింది. బాంబే హైకోర్టు ఆదేశం ప్రకారం, విడాకుల తర్వాత 6 నెలల కూలింగ్ పీరియడ్‌ను వదులుకోవడానికి ఈ జంటకు అనుమతి ఇచ్చింది.
Bombay High Court: ఏ తల్లీ తన సొంత బిడ్డను కొట్టదు అని బాంబే హైకోర్టు మంగళవారం వ్యాఖ్యానించింది. ఏడేళ్ల కొడుకుపై దాడి చేసినందుకు తల్లితో సహా ఆమె భాగస్వామిపై కేసు నమోదై, అరెస్ట్ చేయబడ్డారు. అయితే, తాజాగా ఈ కేసులో బాలుడి తల్లి అయిన 28 ఏళ్ల మహిళకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
Wardha gang rape case: 2010లో సంచలనం సృష్టించిన ‘‘వార్ధా సామూహిక అత్యాచారం’’ కేసులో సంచలనం నమోదైంది. ఈ అత్యాచార కేసులో దోషులుగా తేలి, 10 ఏళ్లుగా జైలు శిక్ష విధించబడిన 8 మందిని నిర్దోషులుగా విడుదల చేస్తూ బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ తీర్పు ఇచ్చింది. ప్రాసిక్యూషన్ సాక్ష్యాలు, ఫిర్యాదుదారుడి వాంగ్మూలంలో అసమానతలు ఉన్నట్లు కోర్టు పేర్కొంది. కేసు నేపథ్యం ఇదే: జూన్ 24, 2010న తనకు ఆరోగ్యం బాగాలేదని, దీంతో ఆస్పత్రికి వెళ్లినట్లు బాధితురాలు…
Mumbai train blast case: 2006, జూలై 11న ముంబై సబర్బన్ రైళ్లలో 11 నిమిషాల్లో ఆర్డీఎక్స్ పేలుళ్లు సంభవించాయి. ఈ ఉగ్రదాడిలో 189 మంది మరణించగా, 827 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఆరున్నర నెలల పాటు జరిగిన విచారణలో నిందితులకు మరణశిక్షతో పాటు యావజ్జీవ శిక్షలు విధించబడ్డాయి. ఈ కేసులో నిందితులు దాఖలు చేసిన మరణ నిర్ధారణ పిటిషన్లు, అప్పీళ్లపై బాంబే హైకోర్టు శుక్రవారం తన తీర్పుని రిజర్వ్ చేసింది. జూలై 2024 నుంచి ఈ…
Bombay High Court: మేధో వైకల్యం ఉన్న మహిళకు తల్లి అయ్యే హక్కు లేదా..? అని బాంబే హైకోర్టు బుధవారం ప్రశ్నించింది. 27 ఏళ్ల యువతి మానసిక స్థితి సరిగా లేదని, అవివాహితురాలు కావడంతో 21 వారాల గర్భాన్ని వైద్యపరంగా రద్దు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆమె తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు ఆర్వి ఘుగే, రాజేష్ పాటిల్‌లతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. తన కుమార్తె గర్భాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నట్లు కూడా పిటిషన్‌లో…