PFI:నిషేధిత ఉగ్రవాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ)తో సంబంధాలున్నాయంటూ 2022లో మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఎటిఎస్) అరెస్టు చేసిన ముగ్గురు వ్యక్తులకు బాంబే హైకోర్టు మంగళవారం బెయిల్ నిరాకరించింది. జస్టిస్ అజే గడ్కరీ, శ్యామ్ చందక్‌లతో కూడిన డివిజన్ బెంచ్ నిందితులు ‘‘2047 నాటికి భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చడానికి కుట్ర న్నారు’’ అని పేర్కొంది. సాక్ష్యాలు నిందితులకు వ్యతిరేకంగా ఉన్నాయని హైకోర్టు పేర్కొంది. రాజీ అహ్మద్ ఖాన్, ఉనైస్ ఉమర్ ఖయ్యామ్ పటేల్ మరియు కయ్యూమ్ అబ్దుల్ షేక్ బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది.
‘‘ 2047 నాటికి భారత్‌ని ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు వారు కుట్ర పన్నారు. వారు ప్రచారకర్తలు మాత్రమే కాకుండా వారి సంస్థ(పీఎఫ్ఐ) విజన్-2047 డాక్యుమెంట్లను కూడా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అని కోర్టు పేర్కొంది. నిందితులు తమ ఎజెండా నెరవేర్చుకోవడం కోసం తమతో కలిసి పనిచేసేందుకు భావసారూప్యత గల వ్యక్తలను కూడా ప్రేరేపించినట్లు కోర్టు గుర్తించింది. దేశం యొక్క ఆసక్తి మరియు సమగ్రతకు హాని కలిగించే కార్యకలాపాలను క్రమపద్ధతిలో చేపట్టారని నిరూపించడానికి అధిక సాక్ష్యాలు ఉన్నాయని బెంచ్ చెప్పింది.