మైనర్ లపై అత్యాచారాలకు పాల్పడితే పోక్సో కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నాయి ప్రభుత్వాలు. మహిళల రక్షణ కోసం కఠిన చట్టాలను అమలు చేస్తున్నాయి. తాజాగా బాంబే హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. అత్యాచార బాధితురాలిని పెళ్లి చేసుకున్నా పోక్సో కోసు రద్దు కాదని కోర్టు స్పష్టం చేసింది. మహారాష్ట్రలోని అకోలాకు చెందిన 29 ఏళ్ల యువకుడు తనపై నమోదైన రేప్ కేసును రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ తిరస్కరించింది.…
Bombay High Court: పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్‌కు సమాధానం ఇచ్చింది. పీఓకే, పాకిస్తాన్ లోపల ఉన్న ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి వందలాది మంది ఉగ్రవాదుల్ని హతమార్చింది. అయితే, మన దేశంలో కొంత మంది మాత్రం దీనిని సమర్థించకుండా, ‘‘ఆపరేషన్ సిందూర్’’కు వ్యతిరేక పోస్టులు పెడుతూ, పాకిస్తాన్ ప్రేమను చూపించారు. ఇలాంటి కేసును విచారిస్తున్న బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Bombay High Court: పాలస్తీనా గాజాలో జరిగిన మారణహోమానికి వ్యతిరేకంగా ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో నిరసనకు అనుమతి ఇవ్వడానికి పోలీసులు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. జస్టిస్ రవీంద్ర ఘుగే, గౌతమ్ అంఖద్‌లతో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను తిరస్కరిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
Bombay High Court: వివాహం తర్వాత భర్తతో ‘‘శృంగారానికి’’ నిరాకరించడం కూడా విడాకులకు కారణం కావచ్చని బాంబే హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇది భర్త పట్ల క్రూరత్వానికి సమామని చెప్పింది. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థిస్తూ, భార్య పిటిషన్‌ని కొట్టేసింది. భర్తతో శారీరక సంబంధాన్ని తిరస్కరించడం, అతనితో వివాహేతర సంబంధం ఉందని అనుమానించడం విడాకులకు కారణం కావచ్చని హైకోర్టు పేర్కొంది.
Bombay High Court: తన భర్త నుంచి విడిపోయిన ఒక మహిళ, తన అత్తమామలపై పెట్టిన క్రిమినల్ కేసును బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ కొట్టివేసింది. వివాహ వివాదాలు ప్రస్తుతం ట్రెండ్‌గా మారాయని, మహిళలను రక్షించడానికి ఉద్దేశించిన చట్టాలు దుర్వినియోగం చేసే ధోరణ పెరుగుతోందని కోర్టు గమనించింది. వివాహాలను రక్షించడానికి, వివాదాలను పరిష్కరించడానికి రూపొందించిన చట్టాలు తరుచుగా దుర్వినియోగం అవుతున్నాయని కోర్టు ప్రస్తావించింది.
Bombay High Court: తన భార్య వ్యభిచారానికి పాల్పడుతుందనే అనుమానంతో ఆమె కుమారుడికి డీఎన్ఏ పరీక్ష చేయించడం సరైంది కాదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. మైనర్ బాలుడి తండ్రిని నిర్ధారించేందుకు డీఎన్ఏ పరీక్ష చేయాలన్న ఫ్యామిలీ హైకోర్టు ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. కేసును విచారించిన న్యాయమూర్తి ఆర్ఎం జోషి, జూలై 1న ఇచ్చిన తన తీర్పులో.. ‘‘డీఎన్ఏ పరీక్షను చాలా అసాధారణమైన సందర్భాల్లో మాత్రమే ఆదేశించగలం. కేవలం ఒక వ్యక్తి భార్య వ్యభిచారంలో ఉందని…
Disha Salian Case: మాజీ సెలబ్రిటీ మేనేజర్ దిశా సాలియన్ ఆత్మహత్య చేసుకుని మరణించిందని, ఆమె మరణంలో ఎలాంటి తప్పు కనుగొనబడలేదని ముంబై పోలీసులు బాంబే హైకోర్టుకు సమర్పించారు. ఇటీవల, దిశ తండ్రి ఆమె సామూహిక అత్యాచారానికి గురైందని, హత్య చేశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ముంబై పోలీసుల ప్రకటన ఆసక్తికరంగా మారింది.
మైనర్ బాలికను "ఐ లవ్ యు" అని ఆటపట్టించాడనే ఆరోపణలపై 2015లో దోషిగా తేలిన 25 ఏళ్ల వ్యక్తిని బాంబే హైకోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. దిగువ కోర్టు తీర్పును కొట్టివేసింది. గతంలో నాగ్‌పూర్ సెషన్స్ కోర్టు.. ఆ వ్యక్తికి భారత శిక్షాస్మృతి (IPC) సెక్షన్లు 354-A (లైంగిక వేధింపులు), 354D (వెంబడించడం), లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (POSCO) చట్టంలోని సెక్షన్ 8 కింద మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
High Court: 2015లో మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలతో 25 ఏళ్ల వ్యక్తిని నిర్దోషిగా విడుదల చేస్తూ బాంబే హైకోర్టు తీర్పు చెప్పింది. బాలిక చేయి పట్టుకుని ‘‘ఐ లవ్ యూ’’ అని చెప్పినందుకు నాగ్‌పూర్ సెషన్స్ కోర్టు విధించిన 3 ఏళ్ల జైలు శిక్షను హైకోర్టు రద్దు చేసింది. నిందితుడి తరుపున కోర్టులో వాదించిన న్యాయవాది సోనాలి ఖోబ్రగడే సెషన్స్ కోర్టు తీర్పుపై అప్పీలు చేశారు. లైంగిక వేధింపులను నిరూపించేందుకు ఈ కేసులో…
Bombay High Court: భార్యకు వివాహేత సంబంధం ఉందని ఓ భర్త కోర్టుకెక్కాడు. తన భార్యకు అక్రమ సంబంధం ఉందని చెబుతూ కొన్ని రికార్డింగ్స్‌ని కూడా కోర్టు ముందుంచారు. అయితే, ఈ కేసులో బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ సంచలన ఆదేశాలు ఇచ్చింది. భర్త చేసిన వాదనల్ని ధ్రువీకరించడానికి ‘‘వాయిస్ శాంపిల్స్’’ ఇవ్వాల్సిందిగా భార్యని ఆదేశించింది.