The Indrani Mukerjea Story: 2012లో దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది షీనాబోరా హత్య- ఇంద్రాణి ముఖర్జియా కేసు. సొంత తల్లి తన కూతురిని హత్య చేసిన ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియాపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంట్ సిరీస్ రూపొందించిది. ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు విడుదలపై స్టే ఇవ్వాలని విచారణ సంస్థ సీబీఐ బాంబే కోర్టును ఆశ్రయించింది. న్యాయమూర్తులు రేవతి మోహితే డేరే, మంజుషా దేశ్‌పాండేలతో కూడిన డివిజన్ బెంచ్ సీబీఐ…
ICICI Bank Loan Fraud : దేశంలో చాలా చర్చనీయాంశంగా మారుతున్న ఐసిఐసిఐ బ్యాంక్-వీడియోకాన్ రుణ మోసం కేసులో పెద్ద అప్‌డేట్ వచ్చింది. కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐకి ఈ వ్యవహారంలో బాంబే హైకోర్టు నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Bombay High Court: తనను వివాహం చేసుకుంటానని నమ్మించి తనపై అత్యాచారం చేశాడని ఓ యువతి, తన ప్రేమికుడిపై వేసిన పిటిషన్‌ని బాంబే హైకోర్ట్ నాగ్‌పూర్ బెంచ్ కొట్టేసింది. ఈ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ముందుగా తామిద్దరం పెళ్లి చేసుకుంటామనే ఆలోచన మేరకే శృంగారంలో పాల్గొన్నామని, అయితే, తన తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకోకపోవడంతోనే వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకోవాల్సి వచ్చిందని సదరు యువకుడు తన పిటిషన్‌లో పేర్కొన్నాడు.
14 మంది శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకూడదన్న స్పీకర్ ఆదేశాలను సవాల్ చేస్తూ శివసేన (షిండే) చీఫ్ విప్ భరత్ గోగావాలే దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు శివసేనకు నోటీసులు జారీ చేసింది. జూన్ 2022లో చీలిక తర్వాత ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని సేన వర్గాన్ని నిజమైన రాజకీయ పార్టీగా ప్రకటిస్తూ.. మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఠాక్రే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో షిండే గ్రూప్…
Bombay High Court: 13 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం కేసులో బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలికపై అత్యాచారం చేసిన కేసులో అరెస్టైన మహారాష్ట్ర వ్యక్తికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. లైంగిక సంబంధం ప్రేమ వ్యవహారంతో జరిగిందని, అది కామం వల్ల కాదని కోర్టు అభిప్రాయపడింది. బాలిక మైనర్ అని.. అయితే ఆమె తన ఇష్టంతోనే ఇంటిని వదిలేసి నిందితుడు నితిన్ ధబేరావ్‌తో కలిసి వెళ్లిందని, ఈ విషయాన్ని పోలీసులకు కూడా…
Supreme Court: పాకిస్తాన్‌కి చెందిన ఆర్టిస్టులను భారతదేశంలో ప్రదర్శనలు ఇవ్వడంపై, వారు ఇక్కడ పనిచేయడంపై పూర్తిగా నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. పిటిషనర్ ‘‘అంత సంకుచిత మనస్తత్వం’’ కలిగి ఉండవద్దని కోరింది. ఈ పిటిషన్‌ని అత్యున్నత కోర్టు కొట్టేసింది. సినీ వర్కర్, ఆర్టిస్ట్ అని చెప్పుకునే ఫైజ్ అన్వర్ ఖురేషీ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిష
Bombay High Court: తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకుని వెళ్లడంపై బాంబే హైకోర్ట్ నాగ్‌పూర్ బెంచ్ కీలక తీర్పు వెల్లడించింది. చట్టపరమైన నిషేధం లేనప్పుడు తన బిడ్డను కిడ్నాప్ చేశాడని బయోలాజికల్ తండ్రి(కన్నతండ్రి)పై కేసు నమోదు చేయలేదని తీర్పు చెప్పింది. 35 ఏళ్ల వ్యక్తిపై నమోదైన ఎఫ్ఐఆర్‌ని రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.
Bombay High Court: షార్ట్ స్కర్టులు ధరించడం, రెచ్చగొట్టేలా డ్యాన్స్ చేయడం లేదా హావభావాలను ప్రదర్శించడం వంటివి ప్రజలకు ఇబ్బంది కలిగించే అసభ్యకరమైన చర్యలుగా పరిగణించలేమని బాంబే హైకోర్ట్, నాగ్‌పూర్ బెంచ్ పేర్కొంది. మే నెలలో తిర్ఖురాలోని టైగర్ ప్యారడైస్ రిసార్ట్, వాటార్ పార్క్‌లోని బాంక్వెట్ హాల్‌లో అసభ్యకరమైన నృత్యాలు చేస్తున్నారని పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసును హైకోర్టు కొట్టేసింది.
Bombay High Court: రూ.100 లంచం తీసుకున్న అధికారి కేసులో బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారికి కోర్టు ఉపశమనం ఇచ్చింది. ఈ కేసును విచారించిన హైకోర్టు..2007లో రూ.100 లంచంగా తీసుకోవడం చాలా చిన్న అంశమని, లంచం కేసులో ప్రభుత్వ వైద్య అధికారిని నిర్దోషిగా విడుదల చేస్తూ తీర్పు చెప్పింది.
Bombay High: మహారాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రుల్లో వరసగా రోగుల మరణాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. నాందేడ్, ఛత్రపతి శంభాజీనగర్, నాగ్‌పూర్ ఈ రెండు ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో 50 మందికి పైగా రోగులు మరణించారు. నాందేడ్‌లోని శంకర్రావ్ చవాన్ ఆస్పత్రిల్లో గడిచిన 72 గంటల్లో 16 మంది పిల్లలతో సహా మొత్తం 31 మంది మరణించారు. ఇక శంభాజీనగర్(ఔరంగాబాద్) ఆస్పత్రిలో 18 మరనణాలు సంభవించాయి.