మాజీ మంత్రి మనీష్ సిసోడియా తీహార్ జైలులోని జైలు నంబర్ 1లో అత్యంత భయంకరమైన నేరస్థులలో ఉంచబడ్డారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆరోపించింది. మనీష్ సిసోడియా ప్రాణాలకు ముప్పు కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు.
తమిళనాడులో బీజేపీకి షాక్ తగిలింది. చెన్నై వెస్ట్ బీజేపీ ఐటీ వింగ్కు చెందిన 13 మంది నేతలు పార్టీకీ రాజీనామా చేశారు.వారం క్రితం తమిళనాడు బీజేపీ ఐటీ వింగ్ అధ్యక్షుడు నిర్మల్ కుమార్, దిలీప్ కన్నన్ పార్టీకి రాజీనామా చేసి ఏఐఏడీఎంకేలో చేరిన అనంతరం డజన్ల కొద్దీ కాషాయ పార్టీ కార్యకర్తలు దీనిని అనుసరించారు.
Somu Veerraju: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు మరో లేఖ రాశారు బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు.. అగ్రి గోల్డ్ బాధితుల సమస్య పరిష్కారంపై తన లేఖలో పేర్కొన్నారు.. అగ్రి గోల్డు బాధితుల పరిష్కారంపై శ్వేత పత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు.. అధికారంలోకి వచ్చిన 6 మాసాల్లో అగ్రిగోల్డు బాధితుల సమస్యలను న్యాయస్థానాల పరిధి నుండి దాటి పరిష్కరిస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. అయితే, అధికారం వచ్చి మూడున్నరేళ్లు దాటినా ఎందుకు పరిష్కరించలేదు? అని…
బీజేపీ కి దర్యాప్తు సంస్థలకు సంబంధమే లేదని తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ కుటుంబానికి ఏ ఆపద వచ్చినా... తెలంగాణ సమాజం అంటారని ఆరోపించారు.
ఎమ్మెల్సీ కవితకి ఈడీ నోటీస్ ల పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఈడీ నోటీసులు ఇస్తే తప్పేంటి? అంటూ ప్రశ్నించారు. లిక్కర్ వ్యాపారం చేసింది మీరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Tripura: త్రిపురలో మరోసారి బీజేపీ అధికారం చేపట్టబోతోంది. త్రిపుర ముఖ్యమంత్రిగా నేడు మాణిక్ సాహా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ హాజరుకానున్నారు. రాష్ట్రంలో బీజేపీని వరసగా రెండోసారి అధికారంలోకి తీసుకురావడంతో మాణిక్ సాహా కీలకంగా పనిచేశారు. దంతవైద్యుడు, రాజకీయనాయకుడిగా సాహాకు క్లీన్ ఇమేజ్ ఉంది. అగర్తలా వివేకానంద మైదాన్ లో ప్రమాణస్వీకారం జరగనుంది.