Washing powder Nirma: అమిత్ షా పర్యటన.. హైదరాబాద్‌లో ‘వాషింగ్ పౌడర్ నిర్మా’భారీ ఫ్లెక్సీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Washing powder Nirma: ఎమ్మెల్సీ కవితకు మద్దతుగా హైదరాబాద్, ఢిల్లీలో శనివారం బై బై మోడీ అంటూ పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో..కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఆయనకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. అమిత్ షా నిన్న (మార్చి 11) హైదరాబాద్ వచ్చారు. అదే రోజు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఈడీ విచారణ కూడా జరిగింది. దీంతో అమిత్ షా పర్యటనకు హైదరాబాద్ లో బీఆర్ ఎస్ నేతలు పెద్ద ఎత్తున పోస్టర్లు ఏర్పాటు చేశారు.
హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ తరపున కొన్ని పోస్టర్లు అంటించగా, ఓ వైపు కవిత, మరోవైపు ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరుతున్న నేతల చిత్రాలు కనిపించాయి. విపక్ష నేత బీజేపీలో చేరితే అతనిపై ఎలాంటి విచారణ జరగదని, దానికి విరుద్ధంగా ఆయన మరక నుంచి బయటపడతారని ఈ పోస్టర్‌లో చూపించారు. హోర్డింగ్ పై వాషింగ్ పౌడర్ నిర్మా..వెల్ కమ్ టు అమిత్ షా అని రాసి ఉంది. ఆ హోర్డింగ్ పై బీజేపీ నేతలు హిమంత బిశ్వశర్మ, నారాయణ రాణే, సువేందు అధికారి, సుజనా చౌదరి, జ్యోతిరాధియ సింధియా సహా పలువురు నేతల ఫొటోలు పెట్టారు. ఎంత అవినీతికి పాల్పడినా బీజేపీలో చేరితే మరకలు పోతాయనే అర్థం వచ్చేలా హోర్డింగ్స్ పెట్టారు.
Also Read
బీజేపీలో చేరిన వెంటనే కేసులు మాయమవుతున్నాయి. బీజేపీలో చేరితే అవినీతి మరకలు కాషాయం అవుతాయంటూ పోస్టర్లు అంటించారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ శనివారం విచారించిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ కేసును కవితపై మోపడానికి వ్యతిరేకంగా బీజేపీపై బీఆర్‌ఎస్ పార్టీ నేతలు అసలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. అదే సమయంలో అమిత్ షా హైదరాబాద్ కు పర్యటన నేపథ్యంలో వినూత్నంగా పోస్టర్లతో ఇలా నిరసనలు తెలిపారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?