Somu Veerraju: ఆంధ్రప్రదేశ్‌లో జనసేన-బీజేపీ మధ్య పొత్తు నడుస్తోంది.. పలు సందర్భాల్లో ఇరు పార్టీల నేతలు ఇది చెబుతూనే ఉన్నారు.. ఇక, త్వరలో కీలక నేతలు బీజేపీలో చేరబోతున్నారు.. దీంతో.. కొత్తగా వచ్చే నేతలు.. జనసేనతో ఎలాంటి సంబంధాలు కొనసాగిస్తారు అనేదానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సోము వీర్రాజు.. రాజకీయాల్లో పరిస్థితి మారుతుంటాయి.. ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఏమి జరుగుతుందో మీరు కూడా చూస్తుండాలి.. త్వరలోనే కీలకమైన నేతలు చాలా మంది భారతీయ జనతా పార్టీలో చేరతారని వెల్లడించారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. రాజకీయాలు జస్ట్ లైక్ క్రికెట్ లాంటిది… ఎప్పుడూ ఒకరే గెలవరు అని వ్యాఖ్యానించారు. ఇక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్‌కుమార్ రెడ్డి.. బీజేపీలో చేరతారన్న ప్రచారంపై స్పందించిన ఆయన.. కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది.. కిరణ్ బీజేపీలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. చాలామంది కీలమైన నేతలు త్వరలో బీజేపీలోకి రాబోతున్నారని.. 2024లో ఏపీలో బీజేపీ గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు.
Read Also: Kunamneni Sambasiva Rao : బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునే విధంగా ఉన్నాయి
మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి త్వరలో బీజేపీలో చేరతారని చెబుతోన్న నేపథ్యంలో.. పవన్ కల్యాణ్.. కిరణ్ కుమార్ రెడ్డి ఎలా వెళ్లాలనే కాంబినేషన్ పై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు సోము వీర్రాజు.. మాది సకల జనుల పార్టీ.. దాని ఆధారంగా రాజకీయాలు బీజేపీలో జరుగుతాయి అన్నారు సోము వీర్రాజు.. కేసీఆర్ దగ్గర నుండి డబ్బులు తీసుకున్న చెంచాగాళ్లే ధర్నాలు చేస్తున్నారు.. అంటూ బీఆర్‌ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు.. అవినీతి వ్యతిరేకంగా మేం ఉంటాం.. ఎవరైనా అవినీతిపరుడు.. సుబ్బారావు కావచ్చు.. సుబ్బలక్ష్మి కావచ్చు.. జ్యోతిలక్ష్మీ కావచ్చు.. అవినీతి చేస్తే ఎవరైనా లోపల వేస్తారని స్పష్టం చేశారు.. ఇక, బండి సంజయ్ వ్యాఖ్యలను మీరు కేసీఆర్ ముద్దు బిడ్డిలా తీసుకుంటే మేం ఎమీ చేస్తాం..? అని ప్రశ్నించారు.. రూ.20 లక్షల వాచ్ పెట్టుకొనే వారినీ మీరు ప్రేమిస్తారు..? ఏమో సమాజం ప్రేమించదు అని ఎద్దేవా చేశారు.. అవినీతి మీదా దర్యాప్తు సంస్థల టార్గెట్ ఉంటుంది.. దాంట్లో మాకు సంబంధం లేదిన స్పష్టం చేశారు సోము వీర్రాజు.