Satya Kumar: తెలంగాణాలో 17 పార్లమెంట్ స్థానాలు మాత్రమే ఉన్నాయి.. దేశంలో 543 పార్లమెంట్ స్థానాలు ఉన్న విషయం కేసీఆర్ మరిచిపోయారు అంటూ ఎద్దేవా చేశారు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్.. ప్రకాశం జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగరాలని చూసినట్టు ఉంది కేసీఆర్ పరిస్థితి అని ఎద్దేవా చేశారు.. దొంగ దొరికి పోతున్నప్పుడు రకరకాల విన్యాసాలు చేస్తారు.. ఢిల్లీ మద్యం కేసులో టీఆర్ఎస్ నాయకులు కటకటాలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి ఉందన్నారు. దోచుకున్న లక్ష కోట్లు ఎవరికి అప్పచెప్పాలో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారని మండిపడ్డారు.. ఇక, కేసీఆర్‌కి.. ప్రధాని నరేంద్ర మోడీకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు.. మహిళా సాధికారత గురించి కవిత మాట్లాడటం హాస్యాస్పదమన్న ఆయన.. అస్కార్ అవార్డు పొరపాటున రాజమౌళికి వచ్చింది.. కేసీఆర్ కుటుంబానికి ఎప్పుడో ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సింది అంటూ సెటైర్లు వేశారు సత్యకుమార్..
Read Also: Tarun Chugh : లిక్కర్ స్కామ్‌లో వందల కోట్ల అవినీతి.. కవిత తప్పకుండా సమాధానం చెప్పాల్సిందే
మరోవైపు.. వైసీపీ, బీజేపీ భిన్నధృవాలు అని వ్యాఖ్యానించారు సత్యకుమార్.. ఆ పార్టీతో కలిసేది లేదు, సమర్థించేదీ లేదని స్పష్టం చేశారు.. అవినీతి కేసుల్లో వైఎస్ జగన్ గతంలోనే జైలుకెళ్లాడు అన్నారు.. ఇక, జగన్ బాబాయి హత్య కేసులో సీబీఐ విచారణ వేగంగా జరుగుతుందన్న ఆయన.. కలుగుల్లో ఉన్న ఎలుకలు అన్ని బయటకు వచ్చాయన్నారు. బాబాయి హత్య కేసులో బాధ్యులు అరెస్ట్ అవుతారని స్పష్టం చేశారు.. వైసీపీ సర్కార్‌పై హాట్ కామెంట్లు చేశారు సత్యకుమార్.. సీఎం వైఎస్ జగన్ పై నాలుగేళ్లలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. సంవత్సరాల పాటు ఓదార్పు యాత్ర, పాదయాత్ర చేసిన జగన్.. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లాలంటే పరదాల మధ్య వెళ్తున్నాడని ఎద్దేవా చేశారు. సొంత నియోజక వర్గం పులివెందుల వెళ్లాలన్నా 1500 మంది పోలీసుల మధ్య వెళ్తున్నారని విమర్శించారు.
Read Also: Canada: భారత్ ముద్దు.. చైనా వద్దు.. డ్రాగన్ కంట్రీని ముప్పుగా భావిస్తున్న కెనడియన్లు..
జగన్ ప్రభుత్వంపై ఉద్యోగులు ఆగ్రహంతో రగిలిపోతున్నారని పేర్కొన్నారు సత్యకుమార్.. టీచర్లను మద్యం షాపుల వద్ద వాడుకుని ఎన్నికల విధులకు పనికి రారని చెబుతున్నారని మండిపడ్డారు.. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం దొంగ ఓట్లు చేర్చారు… దొంగ ఓట్ల కోసం రాష్ట్రంలో ఒక మంత్రినే పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడికి పంచాయతీరాజ్ శాఖని వదిలేసి దొంగ ఓట్ల కోసం ఆ మంత్రి వెళ్తున్నాడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్..