Somu Veerraju: కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి త్వరలోనే భారతీయ జనతా పార్టీలో చేరతారనే ప్రచారం సాగుతోంది.. అప్పటికే ఆయన బీజేపీ అగ్రనాయకత్వంలో మాట్లాడారని.. జాతీయ స్థాయిలో ఆయనకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని.. అన్ని సెట్ అవుతే.. త్వరలోనే ఆయన బీజేపీ కండువా కప్పుకుంటారని చెబుతున్నారు.. అయితే, చిత్తూరులో మీడియాతో మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. కిరణ్ కుమార్ రెడ్డి ఇష్యూపై స్పందించారు.. కిరణ్ కుమార్…
తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గుంటలకు ఢిల్లీలో బయలుదేరి.. రాత్రి 8.25కు హకీంపేట్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు.
Sunil Deodhar: సీఎం వైఎస్ జగన్ఫై తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ ధియోదర్.. కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు అని ఆరోపించారు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే జాబు ఇస్తానన్నాడు.. జాబు రాలేదు.. రాష్ట్రంలోకి గంజాయి వచ్చిందని విమర్శించారు. రాష్ట్రాన్ని లిక్కర్, ఇసుక మాఫియగా మార్చారని ధ్వజమెత్తిన ఆయన.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు.. పోవాలి జగన్, పోవాలి జగన్.. మన…
మహిళా రిజర్వేషన్ బిల్లుపై తమ వైఖరిని స్పష్టం చేయాలని కాంగ్రెస్ శుక్రవారం బీజేపీని కోరింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల రెండో భాగంలో లోక్సభలో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేసింది.
PM Modi To Visit Karnataka On March 12: మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోయే కర్ణాటక రాష్ట్రంలో మరోసారి ప్రధాని నరేంద్రమోదీ పర్యటించనున్నారు. ఈ నెల 12న కర్ణాటకకు వెళ్లనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభంతో పాటు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. దాదాపుగా రూ. 16,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి. ప్రతిష్టాత్మక 10 వరసల మైసూర్-బెంగళూర్ ఎక్స్ ప్రెస్ వేను ప్రధాని మాండ్యాలో ప్రారంభించనున్నారు. ఆ తరువాత హుబ్బళ్లి-ధార్వాడలో వివిధ అభివృద్ధి…
Mandya MP Sumalatha extends 'full support' to BJP: ప్రముఖ సినీనటి, ఎంపీ సుమలత అంబరీష్ బీజేపీ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. గత లోక్ సభ ఎన్నికల్లో ఆమె మాండ్యా లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. ఈ నెల 12న ప్రధాని నరేంద్రమోదీ కర్ణాకటక పర్యటనకు వెళ్లనున్నారు.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్ పై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విమర్శలు గుప్పిస్తోంది. ఆప్ నాయకులు బీజేపీ టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేంద్రాన్ని రాక్షస రాజు హిరణ్యకశిపుడితో పోల్చారు. పరోక్షంగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుపించారు. ఈ మేరకు ఆయన హిందీలో ట్వీట్ చేశారు. కొంతమంది తమను తాము హిరణ్య కశ్యపుడిలా భావించుకుంటూ తమను తాము దేవుడిలా…