GVL Narasimha Rao: ఈసారి మాకు అవకాశం ఇస్తే.. సమస్యలను ప్రధాన మంత్రికి చూపించి అభివృద్ధి చేస్తామని ప్రకటించారు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు.. విజయనగరంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర అభివృద్ధి ఒక్క బీజేపీతోనే సాధ్యం.. అందుకే మా ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించండి అంటూ పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం.. ఇక్కడ నుంచి పొట్టకూటి కోసం వలసలు వెళ్లిపోతున్నారన్న ఆయన..…
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బ్రిటన్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భారత్లో ప్రజాస్వామ్యం, పార్లమెంట్ పనితీరుపై బ్రిటన్ ఎంపీలు ఆయనను ప్రశ్నించారు. వీటికి సమాధానంగా భారత్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని రాహుల్ గాంధీ వెల్లడించారు.
Satya kumar: విశాఖపట్నం వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్(జీఐఎస్) నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబట్టింది.. ఈ మేరకు ఆయా సంస్థలతో ఎంవోయూలు కూడా కుదుర్చుకుంది.. అయితే, జీఐఎస్పై విపక్షాల నుంచి విమర్శలు తప్పడం లేదు.. ఈ వ్యవహారంపై స్పందించిన బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్.. శ్రీ సత్యసాయి జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మెలో ఒక్క పైసా కూడా విదేశీ పెట్టుబడి రాలేదని ఆరోపించారు.. బటన్లు నొక్కినట్లు ఉత్తుత్తి కార్యక్రమాలు చేయడమేంటి..!…
నాగాలాండ్ రాజకీయ ప్రముఖుడు, సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన నెయిఫియు రియో ఐదోసారి సీఎం పదవిని చేపట్టనున్నారు. తాజా ఎన్నికల్లో అధికారానికి అవసరమైన పూర్తి మెజార్టీ సాధించిన ఎన్డీపీపీ కూటమి.. మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ఐదోసారి సీఎంగా నెయిఫియు రియో ప్రమాణస్వీకారం చేశారు.
Lalu Prasad Yadav: ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ లో నిందితుడిగా ఉన్న రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ను సీబీఐ అధికారులు ఈ రోజు ప్రశ్నించనున్నారు. ఇటీవలే ఆయన సింగపూర్ లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు. అతని కుమార్తె రోహిణి ఆచార్య తండ్రికి కిడ్నిని ఇచ్చారు. ఇదిలా ఉంటే రోహిణి ఆచార్య సీబీఐ అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. తన తండ్ర నిత్యం వేధింపులకు గురవుతున్నారని.. ఆయనకు…
Udhayanidhi Stalin: డీఎంకే పార్టీ యువనేత, ఆ రాష్ట్ర మంత్రి, సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్ ప్రతిపక్ష అన్నాడీఎంకే, బీజేపీ కూటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు. డీఎంకే పార్టీ ఆధ్వర్యంలో కోయంబత్తూర్ లో ఆదివారం సామూహిక వివాహ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉదయనిధి హాజరయ్యారు. సీఎం ఎంకే స్టాలిన్ 70వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ ఖర్చుతో 81 జంటలకు పెళ్లి జరిపించారు.
Rahul Gandhi: బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉంటుందని కలలు కంటోందని రాహుల్ గాంధీ విమర్శించారు. కాంగ్రెస్ పని అయిపోయిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. సోమవారం లండన్ లో జరిగి చాథమ్ హౌస్ థింక్ ట్యాంక్లో ఆయన ప్రసంగించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నదని గుర్తు చేశారు.