Karnataka: కర్ణాటక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మరికొన్ని రోజుల్లో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడ అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా మతపరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు అక్కడి ప్రజాప్రతినిధులు. ఇప్పటికే కర్ణాటకలో టిప్పు వర్సెస్ సావర్కర్ వివాదం కొనసాగుతూనే ఉంది.
ఇదిలా ఉంటే కర్ణాటక బీజేపీ చీఫ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. కర్ణాటక బీజేపీ చీఫ్ నళిన్ కుమార్ కటీల్ హవేరీ జిల్లాలో ఎస్టీ మోర్చాను ఉద్దేశించి మాట్లాడుతూ.. అసెంబ్లీలో రామపూజ, హనుమాన్ మంత్రాన్ని పఠించాలంటే ప్రజలు బీజేపీకే ఓటేయాలని కోరారు. ప్రజలు రామపూజ, హనుమాన్ చాలీసా చదవాలంటే మాకే ఓటేయాలని ప్రజలు కోరారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికలు టిప్పు సుల్తాన్ వర్సెస్ వీడీ సావర్కర్‌పైనే జరుగుతాయని గత నెలలో ఈయన వ్యాఖ్యలు చేయడంపై దుమారం రేగింది. కర్ణాటక విధానసభలో వాల్మీకికి గౌరవం ఇవ్వాలని అందుకు బీజేపీి ఓటేయాలని అన్నారు.
అంతకుముందు లవ్ జిహాద్ పై ఎన్నికల్లో పోరాడతానంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సారి రాష్ట్రంలో ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్ మధ్య సావర్కర్ వర్సెస్ టిప్పుగా జరుగుతాయని అన్నారు. మరికొన్ని రోజుల్లో అక్కడి ఎన్నికలు జరగనున్న తరుణంలో బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలని అనుకుంటోంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ సారి తామే అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉంది. ఈ రెండు పార్టీల మధ్య రసవత్తరపోరు కొనసాగుతోంది. మరోవైపు జేడీఎస్ కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.