Sambasivarao said that it is not good to be angry with BJP: బండి సంజయ్ ఏం చదువుకున్నారో మాకు తెలియదు సెన్సేషన్ కోసమో, వార్తల కోసమో ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని, దానిని ఖండిస్తే మేం బీఆర్ఎస్ కు సపోర్ట్ అంటారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. ఈనెల 25 నుంచి నియోజకవర్గాల్లో ఇంటింటికీ సీపీఐ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. దేశం లో రాజ్యాంగాన్ని, హక్కులను తుంగలో తొక్కుతోంది కేంద్ర ప్రభుత్వం అంటూ ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం, ఆప్ ప్రభుత్వం లను కూల్చివేయాని చూస్తుందన్నారు. విచారణ సంస్థ లను అడ్డుపెట్టుకుని రాజ్యాంగం ను కూల్చేయాలని చూస్తుందన్నారు. దేశంలో ఎన్నడూ లేనంతగా ఆకలి బాధలు, అసమానతలు పెరిగిపోయాయి అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరణ చేసుకుంటున్నారని తెలిపారు. మోడీ వచ్చిన తర్వాత దేశం ఏం మంచి జరిగింది? అని ప్రశ్నించారు. దేశం లో అత్యంత అవినీతి ప్రధాని నరేంద్ర మోడీ అని ఆరోపించారు.
Read also:ELON MUSK : మూతపడ్డ బ్యాంక్.. కొనుగోలుకు మస్క్ ప్లాన్
అదానీ 12లక్షల కోట్ల కుంభకోణం దేశంలో జరిగిందన్నారు. 2లక్షల కోట్ల, రూపాయల కుంభకోణాలు మోదీ హయాం లో జరిగాయన్నారు. ఆయన నీతి, నిజాయితీ గురించి మాట్లాడుతున్నారన్నారు. అదానీ పోర్ట్ లో 21కోట్ల హెరాయిన్ దొరికింది ఒక్క కేసైనా పెట్టారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అవినీతి లేని బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయా? అని మండిపడ్డారు. బుల్డోజర్ లు పేదల గుడిసెలపై ఎక్కిస్తావా? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ నుంచి దేశాన్ని కాపాడుకోవడం అనేది కమ్యునిస్టు లు నిర్ణయించారన్నారు. బండి సంజయ్ ఏం చదువుకున్నారో మాకు తెలియదు అంటూ ఎద్దేవ చేశారు. సెన్సేషన్ కోసమో, వార్తల కోసమో ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. దానిని ఖండిస్తే మేం బీఆర్ఎస్ కు సపోర్ట్ అంటారని నిప్పులు చెరిగారు. బీజేపీ ని వ్యతిరేకంగా పోరాడుతున్న బీఆర్ఎస్ కు మద్దతు ఉంటుందన్నారు. గవర్నర్ ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వరా.? అంటూ మండిపడ్డారు.
Read also:KTR Counter: పారిపోయిన ఎమ్మెల్యే ఎవరో చెప్పుకోండి చూద్దాం? కిషన్రెడ్డికి కేటీఆర్ కౌంటర్..
ఇదేనా మోదీ మార్క్ పాలన అంటూ ప్రశ్నించారు. లిక్కర్ కేసు కేవలం కవిత కోసం కాదు తెలంగాణ ప్రభుత్వం పై బీజేపీ కన్ను పడిందన్నారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, కానీ తప్పు చేసిన వారందరిపై అలానే వ్యవహరించాలని అన్నారు. పోడు పట్టాలు గతంలో చెప్పిన వారందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 58, 59 జీవో ప్రకారం రెగ్యులరైజ్ చేసిన ప్లాట్లను రెగ్యులరైజ్ చేసి 5లక్షలతో ఇల్లు కట్టించి ఇవ్వాలని అన్నారు. నీరు పేదలకు ఇల్లస్థలాలు ఇచ్చే వరకు జెండా పాతి ఇల్లస్థలాల కోసం పోరాడుతామన్నారు. జిల్లాలు నియోజకవర్గాల వారీగా ఇంటింటికీ వెళ్తామన్నారు. జిల్లాల వారీగా నేతలకు బాధ్యత ఇస్తున్నామన్నారు. 25న బయ్యారం పేరులో ఈ యాత్ర లు ప్రారంభం చేస్తున్నామని తెలిపారు. 33 జిల్లాలకు వెళ్ళేలా మరోయాత్ర చేపడతామన్నారు. హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహించి ఈ యాత్ర ముగిస్తామని స్పష్టం చేశారు. 119 నియోజక వర్గాల వారిగా సభలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు.
Nani: దసరా సినిమాకి కష్టాలు తప్పేలా లేవు… ఈ గండం నాని ఎలా దాటుతాడో ఏమో?