ముఖ్యమంత్రి కేసీఆర్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. మీ పాలనలో ఉద్యోగ, ఉపాధ్యాయులుసహా ప్రజలంతా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారని, ఉద్యోగుల సమస్యలేవీ పరిష్కారం కావడం లేదని లేఖలో బండి సంజయ్ పేర్కొన్నారు.
Shivraj Singh Chouhan: రాహుల్ గాంధీ యూకే కేంబ్రిడ్జ్ వేదికగా భారత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇజ్రాయిలీ స్పైవేర్ పెగాసస్ ద్వారా తనతో పాటు పలువురు రాజకీయ నేతలపై నిఘా పెట్టారని రాహుల్ గాంధీ అన్నారు. దీనిపై బీజేపీ విరుచుకుపడుతోంది. తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాహుల్ గాంధీపై మండిపడ్డారు.
తెలంగాణలో అప్పులన్నీ తీరి అభివృద్ధి చెందాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ ఎదిగిందని ఆయన తెలిపారు. శనివారం రాత్రి ఆదిలాబాద్లో జరిగిన చేరికల సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
Kapil Sibal: ప్రముఖ న్యాయవాది, మాజీ కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ బీజేపీపై పోరాటానికి సిద్ధం అయ్యారు. దీని కోసం కొత్త వేదిక ఏర్పాటు చేశారు. బీజేపీ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొనేందుకు ‘ఇన్సాఫ్’ అనే వేదికను స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. ప్రజల కోసం ‘ఇన్సాఫ్ కే సిపాహి’ పేరిట వెబ్ సైట్ తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఈ వేదిక ద్వారా ప్రజల సమస్యలపై లాయర్లు పోరాటా చేస్తారని అన్నారు. దీనికి విపక్ష పార్టీల ముఖ్యమంత్రులు మద్దతు…
Sharad Pawar: దేశంలో మార్పు పవనాలు బలంగా వీస్తున్నాయని ఎన్సీపీ నేత శరద్ పవార్ అన్నారు. ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ తన కంచుకోట అయిన కస్బాపేత్ అసెంబ్లీ స్థానాన్ని కోల్పోయింది. దీనిపై మాట్లాడుతూ శరద్ పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు. కస్బా పేత్ ఓటమితో ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారని స్పష్టమైందని ఆయన అన్నారు. దాదాపుగా మూడు దశాబ్ధాలుగా పూణేలోని ఈ నియోజకవర్గం బీజేపీకి కంచుకోటగా ఉంది.
BJP's Fresh Attack on Rahul Gandhi: రాహుల్ గాంధీ విదేశాల్లో భారతదేశం పరువును తీస్తున్నారని మండిపడుతోంది భారతీయ జనతా పార్టీ(బీజేపీ). ప్రపంచ దేశాలు భారత్ ను పొగుడుతుంటే.. రాహుల్ గాంధీ మాత్రం విమర్శిస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా అన్నారు. పాకిస్తాన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలను చేసేందుకు భయపడుతోంది,