Sumalatha Ambareesh joining BJP: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. రాజకీయ నాయకురాలిగా మారిన ప్రముఖ నటి, మాండ్యా లోక్సభ ఎంపీ సుమలత అంబరీష్.. అధికార బీజేపీలో చేరవచ్చనే ప్రచారం సాగుతోంది.. శుక్రవారం మండ్యలో జరిగే ప్రెస్ మీట్లో స్వతంత్ర ఎంపీ సుమలత బీజేపీలో చేరే నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. మద్దూరు తాలూకాలోని గెజ్జలగెరె వద్ద బెంగళూరు-మైసూరు ఎక్స్ప్రెస్వేను ప్రారంభించి, అక్కడ మెగా బహిరంగ సభలో ప్రసంగించేందుకు మార్చి…
తమిళనాడులో అన్నాడీఎంకే, దాని మిత్ర పక్షం బీజేపీకి మధ్య విభేదాలు తలెత్తిన నేపథ్యంలో పొత్తు ఉంటుందా? లేదా ? అన్నది ఆసక్తి రేపుతోంది. ఐదుగురు బీజేపీ నేతలు అన్నా డీఎంకేలో చేరడంతో మొదలైన వివాదం ముదిరింది.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ దేశంలో ఎవరూ వినడం లేదని విదేశాల్లో మాట్లాడుతున్నారని... అక్కడ చిన్నపిల్లాడిలా ఏడుస్తున్నారని శివరాజ్ సింగ్ చౌహాన్ ఎద్దేవా చేశారు.
ఢిల్లీ మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై బీజేపీ నేత డీకే అరుణ స్పందించారు. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసుల వెనుక బిజెపి కక్షసాధింపు ఏమీ లేదన్నారు. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపించినట్లే అధికారంలో వచ్చింది మొదలు అందరిపై కక్షసాధింపుకు దిగిన బిఆర్ఎస్ పార్టీకి, కల్వకుంట్ల కుటుంబానికి అందరూ అలాగే చేస్తారని అనిపిస్తున్నట్లుందని అన్నారు.
Kiren Rijiju: దేశ ప్రజలను విభజించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశ ఐక్యతకు అత్యంత ప్రమాదకరమని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్రమోదీని విమర్శిస్తూ రాహుల్ గాంధీ ఇటీవల లండన్లో చేసిన వ్యాఖ్యలపై రిజిజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Asaduddin Owaisi: నాగాలాండ్ రాష్ట్రంలో శరద్ పవార్ ఎన్సీపీ పార్టీ, బీజేపీ సంకీర్ణానికి మద్దతు ఇవ్వడంపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు. నాగాలాండ్ ఎన్సీపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి నేఫియు రియోకు మద్దతు ప్రకటించిన తర్వాత అసదుద్దీన్ శరద్ పవార్ పై విమర్శలు గుప్పించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 60 స్థానాలకు గానూ ఎన్డీపీపీ-బీజేపీ పార్టీలు 37 స్థానాలను కైవసం చేసుకున్నాయి.
Karnataka: మహిళా దినోత్సవం రోజు ఓ మహిళకు అవమానం ఎదురైంది. బొట్టు పెట్టుకోలేదని ఓ మహిళను బహిరంగంగా తిట్టారు బీజేేపీ ఎంపీ. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై రాజకీయ దుమారం చెలరేగింది. బీజేపీ ఎంపీ తీరును, బీజేపీని కాంగ్రెస్ విమర్శిస్తోంది.