అమెరికాలో ఉద్యోగం చేసిన కవితకు తెలంగాణ పౌరుషం లేదని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి అన్నారు. తమ లాంటి వారికి తెలంగాణ వాదం నేర్పించింది బీజేపీ అని.. తమకు కాకుండా ఇంకెవరికి తెలంగాణ పౌరుషం ఉంటది? అన్నారు. తమది హిందుగాళ్లు బొందు గాళ్లు అన్న రక్తం కాదని.. కవిత స్టేట్మెంట్ ఇచ్చే ముందు స్థాయి చూసుకోవాలని విమర్శించారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.
MLC Kavitha : హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ప్రాంగణం మంగళవారం ఉదయం ఉద్రిక్త వాతావరణాన్ని చూసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జారీ చేసిన నోటీసులకు వ్యతిరేకంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగిన ఈ ధర్నాకు భారీ సంఖ్యలో జాగృతి కార్యకర్తలు తరలివచ్చారు. కవిత తన వ్యాఖ్యలతో ఈ వ్యవహారాన్ని పూర్తిగా రాజకీయ కుట్రగా అభివర్ణించారు.…
Konda Vishweshwar Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన లేఖ రాజకీయ డ్రామా మాత్రమేనని, దీని వెనుక అసలు స్కెచ్‌ను మాజీ సీఎం కేసీఆరే తయారుచేశారని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన… ఈ డ్రామా ద్వారా కవిత మీడియా దృష్టిని ఆకర్షించగలిగిందని, హెడ్లైన్లలో నిలవడమే లక్ష్యంగా ఇది సాగించబడిందని వ్యాఖ్యానించారు. “కవిత తన ఉద్దేశాన్ని సాధించగలిగింది. బీఆర్ఎస్ ప్రజాదరణ కోల్పోతుండటంతో దృష్టి మళ్లించేందుకు…
CM Chandrababu : ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా, ప్రజల తీర్పుపై సీఎం చంద్రబాబు నాయుడు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. నాటి ప్రజా తీర్పు ద్వారా రాష్ట్రంలో ఉన్మాద పాలనను తుది గా అడ్డుకున్నామని ఆయన పేర్కొన్నారు. వచ్చే నాలుగేళ్లలో కూటమి ప్రభుత్వంలో మరింత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రజలకు, కూటమి పార్టీల కార్యకర్తలు, నేతలకు ఆయన అభినందనలు తెలియజేశారు. “జూన్ 4….…
ఢిల్లీ తరగతి గదుల కుంభకోణం కేసులో మాజీమంత్రులు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్లకు ఏసీబీ సమన్లు జారీ చేసింది. రూ.2,000 కోట్ల కుంభకోణం జరిగినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. జూన్ 6న హాజరుకావాలని సత్యేంద్ర జైన్‌కు, జూన్ 9న హాజరుకావాలని మనీష్ సిసోడియాకు సమన్లలో ఏసీబీ పేర్కొంది.
కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ హర్యానా పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గతేడాది హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ బోల్తా పడింది. అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేయగా.. తీరా రిజల్ట్ సమయానికి అంచనాలన్నీ తారుమారయ్యాయి.
Jagga Reddy : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి బీజేపీ నేతలపై, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ముఖ్యంగా రాహుల్ గాంధీపై లేనిపోని విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. మీడియాతో మాట్లాడిన ఆయన, దేశ భద్రతపై ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ నిష్క్రియతను పరోక్షంగా ఎండగట్టారు. జగ్గారెడ్డి మాట్లాడుతూ.. పాకిస్తాన్ మిలిటెంట్లు దేశంలోకి చొరబడి 26 మందిని కాల్చి చంపారని, కాశ్మీర్‌లోని పార్క్‌లో ఉగ్రవాదులు హింస సృష్టించేసరికి కేంద్ర ఇంటలిజెన్స్ ఏం చేస్తోంది? అని ప్రశ్నించారు. దేశంలో…
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్.. కేంద్రం నియమించిన దౌత్య బృందానికి నాయకత్వం వహించారు. పాకిస్థాన్ వైఖరిని విదేశాల్లో ఎండగట్టేందుకు అధికార-ప్రతిపక్ష ఎంపీల బృందాలను విదేశాలకు పంపించింది. ఇక కాంగ్రెస్‌ను సంప్రదించకుండానే ఆ పార్టీ ఎంపీ శశిథరూర్‌ను కేంద్రం నియమించడంపై వివాదం చెలరేగింది.
ఎమ్మెల్సీ కవిత తాటాకు చప్పుళ్లకు బీజేపీ భయపడదని ఆ పార్టీ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. సిద్దిపేటలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీపై కవిత చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.