కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్.. నిత్యం ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తూ.. ప్రధాని మోడీని ఆకాశానికి ఎత్తుతున్నారు. అంతేకాకుండా బీజేపీ ఎంపీలతో చెట్టాపట్టాల్ వేసుకుని తిరగడంతో శశిథరూర్ పార్టీ మారడం ఖాయమని పొలిటికల్‌గా అందరూ ఫిక్స్ అయిపోయారు. ఎన్నో రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా ఇటీవల కేంద్ర ప్రభుత్వం.. విదేశాలకు దౌత్య బృందాలను పంపించింది. ఆ బృందంలో ఒక కమిటీకి శశిథరూరే నాయకత్వం వహించారు. దీంతో పార్టీ మారడం ఖాయంగా వార్తలు వచ్చాయి.
ఇది కూడా చదవండి: Gadwal Murder Twist: తన భార్యను కూడా చంపాలనుకున్న బ్యాంక్ మేనేజర్.. తేజేశ్వర్ మర్డర్ కేసులో మరో ట్విస్ట్
మంగళవారం ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు శశిథరూర్ స్పందించారు. తాజా పరిణామాలను బట్టి చూస్తే.. పార్టీ మారడం ఖాయమా? అని విలేకరి అడిగాడు. దానికి చిరునవ్వు చిందిస్తూ.. బీజేపీలో చేరడానికి అవేమీ సంకేతాలు కావని స్పష్టం చేశారు. ప్రధాని మోడీ చొరవతో.. ఇతర దేశాలతో భారత్ సంబంధాలు మెరుగుపడ్డాయని.. అయితే ఇది బీజేపీనో, కాంగ్రెస్ తీసుకొచ్చిన విదేశాంగ విధానం కాదని.. ఇది భారతదేశ విదేశాంగ విధానం అని చెప్పుకొచ్చారు. సుమారు 11 ఏళ్ల కిందట పార్లమెంట్‌లో విదేశాంగ వ్యవహారాల కమిటీ చైర్మన్‌గా ఉన్నప్పుడు కూడా ఇదే విషయం చెప్పినట్లు గుర్తుచేశారు. అంత మాత్రాన బీజేపీలో చేరతానని కాదని.. ఇది జాతీయ సమైక్యతకు సంబంధించిన విషయంగా పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ అధిష్టానంతో విభేదాలు ఉన్న మాట వాస్తవమేనని.. నాలుగు గోడల మధ్య చర్చించుకుంటే పరిష్కారం అవుతాయని తెలిపారు. తాను ఇప్పటికీ కాంగ్రెస్‌కు విదేయుడినేనని.. పార్టీకి అవసరమైతే పెద్ద పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
ఇది కూడా చదవండి: YS Jagan Case: మాజీ సీఎం వైఎస్ జగన్‌పై మరో కేసు.. పిలిచినప్పుడు పీఎస్‌కు రావాలని..!