Mallikarjun Kharge: శశిథరూర్ వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి నచ్చడం లేదు. ఆయనను పార్టీలో ఉంచుకోలేక, బయటకు పంపించలేక హస్తం పార్టీ సతమతం అవుతోంది. మరోవైపు, థరూర్ ప్రధాని నరేంద్రమోడీని, మోడీ నాయకత్వాన్ని ప్రశంసించడంపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహంతో ఉంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత, ప్రపంచ దేశాలు పర్యటించిన దౌత్యబృందాల్లో ఒకదానికి శశిథరూర్ నాయకత్వం వహించిన సంగతి తెలిసిందే.
Read Also: Mahavaatar: ఏకంగా 7 సినిమాలతో సినిమాటిక్ యూనివర్స్ అనౌన్స్ చేసిన హోంబాలే
ఇదిలా ఉంటే, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జన ఖర్గే బుధవారం మాట్లాడుతూ శశిథరూర్‌పై విమర్శలు గుప్పించారు. ‘‘శశి థరూర్ భాష చాలా బాగుంది. అందుకే ఆయనను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఉంచారు. మేము ఒకే గొంతుతో మాట్లాడామని, దేశం కోసం కలిసి నిలబడ్డామని నేను గుల్బర్గాలో చెప్పాను. ఆపరేషన్ సిందూర్‌లో మేమంతా దేశానికి మద్దతుగా నిలబడ్డాము. మాకు దేశం ముందు అని చెప్పాము, కానీ కొంతమంది మోడీ ముందు అని, దేశం తర్వాత అని అంటున్నారు. కాబట్టి, మనం ఏమి చేయాలి?’’ అని అన్నారు.
మోడీ ప్రభుత్వంలో ఎన్నికల కమిషన్ ‘‘తోలుబొమ్మ’’గా మారిందని ఖర్గే ఆరోపించారు. మోడీ తాను ఎన్నికల్లో గెలుస్తానని చెబుతున్నారు, మళ్లీ మళ్లీ గెలుస్తానని బీహార్‌లో ప్రచారం చేస్తున్నారని, ఎన్నికల కమషన్ ఇప్పుడు తొలుబొమ్మగా మారిందని విమర్శించారు. ప్రధాని మోడీ మీరు ఎన్నికల్లో గెలవడం లేదని మీ యంత్రం గెలుస్తుందని ఆయన అన్నారు.