Off The Record: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీజేపీ సీబీఐ దర్యాప్తు కోరడం వెనుక మతలబేంటి?
- సిట్ దర్యాప్తును విశ్వసించని బీజేపీ నేతలు..
- సీబీఐ దర్యాప్తు కోసం తెలంగాణ బీజేపీ డిమాండ్..
- ట్యాపింగ్ గురించి ముందు నేనే మాట్లాడానన్న బండి..
- బండి సంజయ్ స్టేట్‌మెంట్‌ని కూడా సిట్ రికార్డ్ చేస్తుందా?..
- కేసీఆర్, కేటీఆర్‌కు ఎందుకు నోటీస్‌లు ఇవ్వలేదని బండి ప్రశ్న..
- విచారణ పేరుతో కాలయాపన జరుగుతోందా అన్న చర్చలు..
- రిటైర్డ్ హయ్యర్ ఆఫీసర్‌కు డీసీపీ, డీఎస్పీ స్థాయి అధికారుల ప్రశ్నలు..
- సిట్ పేరుతో కాలయాపన మాత్రమే అంటున్న బీజేపీ..
- సీబీఐ రంగంలోకి దిగితే ఎక్కడికక్కడ కదులుతాయన్న టాక్..
- సీబీఐకి ఇచ్చేందుకు రాష్ట్రం సిద్ధంగా లేదన్న ఒక వాదన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ తరంగాలన్నీ సీబీఐ వైపు పయనిస్తున్నాయా? కేసును కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించే అవకాశం ఉందా? ప్రభుత్వ చర్యలు కూడా ఆ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయా? ఓవైపు సిట్ దర్యాప్తు జరుగుతుండగానే సీబీఐ డిమాండ్ ఎందుకు పెరుగుతోంది? బీజేపీ నేతల సీబీఐ డిమాండ్ మతలబేంటి?
Read Also: Off The Record: వైసీపీ అధిష్టానం చెప్పినా ఆ ఇద్దరి నేతల మధ్య వైరం ఆగట్లేదా..?
Also Read
- OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
- Off The Record: బీఆర్ఎస్, బీజేపీ టార్గెట్ లిస్టులో దానం నాగేందర్.. కాంగ్రెస్‌కు కూడా భారమేనా?
- OTR: ఆదోని, ఎమ్మిగనూరు కూటమిలో కుమ్ములాటలు స్థానిక ఎన్నికలపై ప్రభావం ..?
- Off The Record: ప్రభుత్వ ప్రాధాన్యతల్ని గుర్తించడంలో విఫలం..? ఉన్నతాధికారులు కాస్త తేడాగా ఉన్నారా?
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కాంగ్రెస్ కన్నా.. బీజేపీనే ఎక్కువగా నమ్ముతోంది. ఈ కేసు దర్యాప్తు కోసం తెలంగాణ ప్రభుత్వం సిట్‌ను నియమించినా.. కాషాయ పార్టీ మాత్రం పూర్తిగా విశ్వసించడం లేదట. అందుకే, సీబీఐ డిమాండ్‌ను గట్టిగా వినిపిస్తున్నట్టు తెలుస్తోంది. స్వయంగా కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఆ పార్టీ ఎంపీలు ఎప్పటికప్పుడు సీబీఐ డిమాండ్‌ను తెర మీదికి తెస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం మీద వత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ జరగుతోందని ముందు చెప్పింది తానే అంటున్న బండి సంజయ్.. బీఆర్‌ఎస్ ప్రభుత్వ చేష్టల మూలంగా సంసారాలు కూలిపోయాయని ఆరోపించారు. ఈ క్రమంలో.. ఇప్పటికే నాటి ఇంటిలిజెన్స్ ఐజీ ప్రభాకర్‌రావుతో పాటు పలువురు పోలీసు అధికారులు, రాజకీయ నాయకులను ప్రశ్నించిన దర్యాప్తు అధికారులు.. తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ నుంచి కూడా స్టేట్‌మెంట్ తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. అందుకోసం ఇప్పటికే సంజయ్ టైం అడిగినట్టు తెలిసింది. అయితే సంజయ్ మాత్రం కేసును సీబీఐకి అప్పగించాలన్న డిమాండ్‌లో మరో ఆలోచన లేదని, అసలు దీనికి ప్రధాన సూత్రధారులైన కేసీఆర్, కేటీఆర్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు.
Read Also: Kannappa: కన్నప్ప మీద మీ అభిప్రాయాలను మీ వరకే ఉంచుకోండి..శరత్ కుమార్ కీలక వ్యాఖ్యలు
అయితే, బీజేపీ ఎంపీలు రఘునందన్ రావు, అర్వింద్ కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో.. కేసు దర్యాప్తు విషయంలో బిజెపి నేతలకు ఎందుకు అనుమానాలు కలుగుతున్నాయి? విచారణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందా? అన్న చర్చలు జరుగుతున్నాయి పొలిటికల్ సర్కిల్స్‌లో. బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నట్టుగా… సీబీఐ దర్యాప్తు జరిగితే… చాలా లోతుల్లోకి వెళ్ళవచ్చు. ప్రస్తుతం సీనియర్ ఆఫీసర్ ర్యాంక్‌లో పదవీ విరమణ చేసిన ప్రభాకర్‌రావును విచారనిస్తున్న సిట్ బృందంలో డీసీపీ, డీఎస్పీ ర్యాంకుల అధికారులు ఉన్నారు. దీంతో సరైన సమాచారం, సమాధానాలు వస్తాయన్న నమ్మకం తమకు లేదని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం కాలయాపన కోసమే.. కేసును గుంజుతోందని, చిత్తశుద్ధి లేని చర్యల మీద తమకు నమ్మకం లేదని అంటున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. అందుకే సీబీఐ రంగంలోకి దిగితే మూలాలన్నీ ఎక్కడికక్కడ కదులుతాయని అంటున్నారు. అయితే ఇక్కడే రెండు పరస్పర భిన్నమైన వాదను వినిపిస్తున్నాయి రాజకీయ వర్గాల్లో. కేసు సీబీఐకి వెళితే.. ఇక తమ చేతుల్లో ఏమీ ఉండబోదని, దాని పర్యవసానాలు కూడా వేరేలా ఉంటాయన్న ఉద్దేశ్యంతో.. కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించేందుకు రాష్ట్రం సిద్ధంగా లేదన్నది రాజకీయంగా పైకి కనిపిస్తున్న ఒక వాదన.
Read Also: Padi Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి ఊరట..
ఇక, అదే సమయంలో.. దానికి విరుద్ధమైన మాటలు సైతం ప్రచారంలో ఉన్నాయి. బీజేపీ నేతల డిమాండ్‌కు అనుగుణంగానే అంతా జరుగుతుందని, సాంకేతిక అంశాల ఆధారంగా మేటర్ కేంద్ర దర్యాప్తు సంస్థ పరిధిలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకుంటున్నారు కొందరు. ఇందుకు సంబంధించి కొన్ని ప్రశ్నల్ని కూడా సంధిస్తున్నారు. ఒక వ్యక్తి ఫోన్‌ను ట్యాప్ చేశారన్న ఆధారాలు మీదగ్గర ఉన్నప్పటికీ… సదరు వ్యక్తిని పిలిచి స్టేట్‌మెంట్ రికార్డ్ చేయడంలో ఉద్దేశ్యం ఏంటి? అసలు మీ ఫోన్ ట్యాంపింగ్ అయిందని బహిరంగంగా చెప్పడం ఎంతవరకు కరెక్ట్? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెదికితే జరగబోయేదేంటో తేలిగ్గానే తెలిసిపోతుందన్నది సదరు టెక్నికల్ అంశాల ఆధారంగా మాట్లాడే వాళ్ళ అభిప్రాయం. వాళ్ళ లెక్క ప్రకారం అయితే… ఇవాళ కాకుంటే.. రేపయినా ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐ పరిధిలోకి వెళ్ళిపోతుంది. దీంతో టెక్నికల్ అంశాల ఆధారంగా సీబీఐ ఇందులోకి ఎంటరైపోతుందా? లేక… రాష్ట్ర ప్రభుత్వ సిట్ సాగదీసి సాగదీసి వదిలేదాకా ఆగుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Bangladesh: బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మీర్జా ఫక్రుల్ ఎన్నిక
-
CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
-
Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
Gold Mine: ఆఫ్రికా దేశంలో ఘోరం.. బంగారు గని కూలి 100 మంది మృతి
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!